Delhi: అసెంబ్లీ స్పీకర్‌గా విజేందర్ గుప్తా ఎన్నిక
ABN , Publish Date - Feb 24 , 2025 | 03:28 PM
సభా సంప్రదాయం ప్రకారం స్పీకర్‌గా విజేందర్ గుప్తా ఎన్నిక కాగానే ఆయనను ముఖ్యమంత్రి రేఖా గుప్తా, విపక్ష నేత సాదరంగా ఆయనను స్పీకర్ సీటుకు తోడ్కొని వెళ్లారు. ఇటీవల ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులందరికి కంటే ఎక్కువ మెజారిటీతో విజేందర్ గుప్తా గెలిచారు.

న్యూఢిల్లీ: అసెంబ్లీ స్పీకర్‌గా రోహిణి నియోజకవర్గం సీనియర్ బీజేపీ ఎమ్మెల్యే విజేందర్ గుప్తా (Vijender Gupta) ఎన్నికయ్యారు. అసెంబ్లీ సమావేశాలు సోమవారంనాడు ప్రారంభం కాగా, స్పీకర్ పదవికి విజేందర్ గుప్తా పేరును ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రతిపాదించారు. దీనికి బీజేపీ ఎమ్మెల్యే మంజిందర్ సింగ్ సిర్సా మద్దతు పలికారు. అనంతరం మూజువాణి ఓటుతో విజేందర్ గుప్తా ఎన్నికయ్యారు.
New Delhi: మహిళలకు ఆర్థిక సాయంపై వాగ్దాన భంగం.. అతిషి, ఆప్ ఎమ్మెల్యేల నిరసన
సభా సంప్రదాయం ప్రకారం స్పీకర్‌గా విజేందర్ గుప్తా ఎన్నిక కాగానే ఆయనను ముఖ్యమంత్రి రేఖా గుప్తా, విపక్ష నేత సాదరంగా స్పీకర్ సీటు వరకూ తోడ్కొని వెళ్లారు. ఇటీవల ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులందరికి కంటే ఎక్కువ మెజారిటీతో విజేందర్ గుప్తా గెలిచారు. తన సమీప ఆప్ అభ్యర్థిపై 37,000 ఆధిక్యంతో ఆయన గెలుపొందారు.
ఎమ్మెల్యేలతో ప్రమాణస్వీకారం
కాగా, సోమవారంనాడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే ప్రొటెం స్పీకర్ అరవింద్ సింగ్ లవ్లీ చేత లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ ప్రమాణస్వీకారం చేయించారు. తొలుత రేఖా గుప్తా ప్రమాణస్వీకారం చేయగా, క్యాబినెట్ మంత్రులు, ఇతర బీజపీ ఎమ్మెల్యేలు, ఆప్ ఎమ్మెల్యేలు వరుసగా ప్రమాణస్వీకారం చేశారు. ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగానే బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఆప్ ప్రయత్నాలు ప్రారంభించింది. మహిళలకు రూ.2.500 ఆర్థిక సాయం ఇస్తామని ఎన్నికల్లో బీజేపీ ఇచ్చిన వాగ్దానాన్ని తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీఎం రేఖాగుప్తా కార్యాలయం వద్ద మాజీ ముఖ్యమంత్రి అతిషి, ఆప్ ఎమ్మెల్యేలకు నిరసనలకు దిగారు. మార్చి 8వ తేదీన తొలి ఇన్‌స్టాల్‌మెంట్ మహిళా లబ్ధిదారులకు చేరాలని డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి..
Congress: బీజేపీని ఎలా ఎదుర్కొందాం?
Tamil Nadu: పొల్లాచ్చి రైల్వేస్టేషన్‌లో హిందీ నేమ్ బోర్డుకు తారు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.