Punjab Minister: 20 నెలలుగా ఉనికిలో లేని శాఖకు మంత్రి
ABN , Publish Date - Feb 22 , 2025 | 02:59 PM
మంత్రి కుల్‌దీప్ సింగ్ ధలివాల్‌కు కేటాయించిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ శాఖ ఉనికిలో లేదని పంజాబ్ ప్రభుత్వం అంగీకరించింది. 2023లో మంత్రివర్గ పునర్వవస్థీకరణలో భాగంగా ఎన్ఆర్ఐ వ్యవహారాలు, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ డిపార్ట్‌మెంట్ బాధ్యతలు ఆయనకు అప్పగించింది.

ఛండీగఢ్: ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఢిల్లీలో ఇటీల అధికారం కోల్పోవడంతో ఇప్పుడు ఆ పార్టీ ఒక్క పంజబ్‌లోనే అధికారంలో ఉంది. భగవంత్ మాన్ నేతృత్వంలోని అక్కడి ఆప్ ప్రభుత్వానికి చెందిన ఓ మంత్రి 20 నెలలుగా ఉనికిలో లేని శాఖకు మంత్రిగా బాధ్యతలు నిర్వహించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ విషయాన్ని ఆలస్యంగా గ్రహించిన పంజాబ్ సర్కార్ ఇందుకు సంబంధించి ఒక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ఆ వ్యవహారం బయటపడింది. ఆప్ సర్కార్ నిర్వాకంపై బీజేపీ విమర్శలు గుప్పించింది.
Actor Kamal Hasan: 20 యేళ్లు లేటుగా వచ్చా... అదే నా తొలి ఓటమి
మంత్రి కుల్‌దీప్ సింగ్ ధలివాల్‌కు కేటాయించిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ శాఖ ఉనికిలో లేదని పంజాబ్ ప్రభుత్వం అంగీకరించింది. 2023లో మంత్రివర్గ పునర్వవస్థీకరణలో భాగంగా ఎన్ఆర్ఐ వ్యవహారాలు, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ డిపార్ట్‌మెంట్ బాధ్యతలు ఆయనకు అప్పగించింది. 2024 సెప్టెంబర్‌లో మరోసారి పునర్వవస్థీకరణ జరిపింది. అవే శాఖలు కొనసాగించింది. తాజాగా ఆ నోటిఫికేషన్‌లో మార్పులు చేసింది. దీంతో మంత్రి చేతిలో ఎన్‌ఆర్ఐ వ్యవహరాల శాఖ ఒక్కటే మిగిలింది.
దీనిపై బీజేపీ విమర్శలు గుప్పిస్తూ, పంజాబ్‌లో పాలనను ఒక జోక్‌లా ఆప్ మార్చేసిందని, ఉనికిలో లేని శాఖకు 20 నెలలుగా మంత్రి బాధ్యతలు నిర్వహించడం ఏమిటని ప్రశ్నించింది. అలాటి ఒక శాఖను మంత్రి నిర్వహిస్తున్నారని సీఎంకు తెలియకపోవడం మరీ విచిత్రంగా ఉందని బీజేపీ ప్రతినిధి ప్రదీప్ భండారి అన్నారు. పంజాబ్ ప్రభుత్వం ఎలాంటి సంక్షోభంలో ఉందో దీనినిబట్టే అర్ధం చేసుకోవచ్చని ఆయన విమర్శించారు.
ఇవి కూడా చదవండి..
Kerala: కేరళలో సంచలనం సృష్టిస్తున్న సామూహిక ఆత్మహత్యలు.. అసలేం జరిగిందంటే..
Air India: ఎయిర్ ఇండియాపై కేంద్ర మంత్రి ఫైర్.. ప్రజలను మోసగిస్తున్నారంటూ గుస్సా
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.