Home » ABN Big Debate
సీట్ల కేటాయింపు జరిగిన తర్వాత గ్రాఫ్ డౌన్ అయ్యిందని ఆర్కే ప్రశ్నించగా అదేం లేదని సీఎం రమేష్ సమాధానం ఇచ్చారు. జగన్ బస్సుయాత్రకు క్రేజీ వచ్చిందని అసత్య ప్రచారం చేసుకున్నారని ఆయన వివరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకానంద రెడ్డిని ఓడించింది తానేనని గుర్తుచేశారు. రాజ్యసభకు పోటీ చేస్తానని ప్రకటిస్తే.. సీఎం జగన్ భయపడ్డారని తెలిపారు. సీఎం జగన్ వైసీపీ నేతలతో చెప్పిన విషయం తనకు 5 నిమిషాల్లో తెలిసిందని చెప్పారు.
అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్‌తో ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణ బిగ్ డిబేట్‌లో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తాను 30 ఏళ్ల క్రితం ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయాల్సి ఉండేదని వివరించారు. 1998లో చిత్తూరు నుంచి పోటీ చేయాలని, చివరి క్షణంలో టికెట్ చేజారిందని గుర్తుచేశారు.
‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ సంస్థల ఎండీ, ప్రముఖ జర్నలిస్టు వేమూరి రాధాకృష్ణ (RK) నేడు (సోమవారం) ‘బిగ్ డిబేట్’ చర్చకు బీజేపీ సీనియర్ నేత, అనకాపల్లి ఎన్డీయే అభ్యర్థి సీఎం రమేశ్ (CM RAMESH) వచ్చారు.
దమ్మున్న చానెల్ ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణ (ABN MD Radha Krishna) పెన్ను పట్టి ‘కొత్తపలుకు’ (Kothapaluku) రాసినా.. టీవీలో కూర్చుని ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ (Open Heart With RK) ఇంటర్వ్యూ చేసినా అదో సంచలనమే అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రజల మన్ననలు పొందింది. ఇప్పటి వరకూ ఎందరో సినీ, రాజకీయాలతో పాటు ఇతర రంగాల ప్రముఖులను ఇంటర్వ్యూ చేసి.. సంచలనమే సృష్టించారు...
ABN Big Debate With CM Revanth Reddy : తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. ఎనుముల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’కి ఇంటర్వ్యూ ఇస్తున్నారు. ఇన్నాళ్లు రేవంత్ రెడ్డి మీడియా ముందుకు వచ్చిన సందర్భాలు దాదాపు లేవనే చెప్పాలి. పైగా పోటా పోటీగా తెలుగు ప్రముఖ చానెల్స్, దినపత్రికలు ఇంటర్వ్యూల కోసం పోటీ పడినప్పటికీ.. ఎన్నికల ముందు ‘బిగ్ డిబేట్’లో ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రేవంత్ రెడ్డి ఇంటర్వ్యూ ఇచ్చారు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో తనకు సంబంధాలపై తెలంగాణ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏబీఎన్ బిగ్ డిబేట్‌లో పాల్గొన్న ఆయన.. జగన్‌తో తనకు రాజకీయంగా ఏమాత్రం సఖ్యత లేదన్నారు.
ఏపీలో సీఎం జగన్ టికెట్ ఇవ్వని వారికి కాంగ్రెస్ తరఫున తాను టికెట్ ఇప్పిస్తానని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఏబీఎన్ బిగ్ డిబేట్‌లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి.. ఢిల్లీలో తానిచ్చిన పార్టీకి వైసీపీ నేతలు హాజరవడం, అలా హాజరవైన వారిని ఏపీ సీఎం జగన్ తిట్టడంపై స్పందించారు.
ఏపీ ఎన్నికల్లో చంద్రబాబుకు సపోర్ట్ చేయడంపై కీలక కామెంట్స్ చేశారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి సీఎం అవడం వల్ల ఏపీలో చంద్రబాబుకు ఏమైనా ఫేవర్ జరిగే ఛాన్స్ ఉందా? అని ఆర్కే ప్రశ్నించగా.. తనదైన శైలిలో స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి.
ABN Big Debate With CM Revanth Reddy : తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యాక రేవంత్ రెడ్డి తొలిసారి ఏబీఎన్-ఆంధ్రజ్యోతికి ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నారు. ఏబీఎన్ సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ.. రేవంత్‌ను సాయంత్రం 7 గంటలకు (జనవరి-06న) బిగ్ డిబేట్ చేయబోతున్నారు. దీంతో రేవంత్ డిబేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా..? అని యావత్ ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..