ABN Big Debate: అసెంబ్లీకి స్థానికుడు.. లోక్ సభకు పరిచయాలు, పలుకుబడి ఉంటే సరిపోతుంది
ABN , Publish Date - Apr 22 , 2024 | 08:18 PM
ఏబీఎన్ బిగ్ డిబేట్‌లో అనకాపల్లి బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ పలు అంశాలను పంచుకున్నారు. అనకాపల్లిలో పోటీకి గల కారణం, అక్కడ విజయంపై ధీమా వ్యక్తం చేశారు. ఎలక్టోరల్ బాండ్స్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చావు కదా ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ ప్రశ్నిస్తే ఇవ్వలేదని సీఎం రమేష్ సమాధానం ఇచ్చారు. తన కంపెనీని పదేళ్ల క్రితమే వదిలేశానని.. షేర్లు మాత్రమే ఉన్నాయని అంగీకరించారు.
ఏబీఎన్ బిగ్ డిబేట్‌లో అనకాపల్లి బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ (CM Ramesh) పలు అంశాలను పంచుకున్నారు. అనకాపల్లిలో పోటీకి గల కారణం, అక్కడ విజయంపై ధీమా వ్యక్తం చేశారు. ఎలక్టోరల్ బాండ్స్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చావు కదా ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ ప్రశ్నిస్తే ఇవ్వలేదని సీఎం రమేష్ సమాధానం ఇచ్చారు. తన కంపెనీని పదేళ్ల క్రితమే వదిలేశానని.. షేర్లు మాత్రమే ఉన్నాయని అంగీకరించారు. ప్రస్తుతం తనకు కిరాయిలతో గడుపుతున్నానని వివరించారు. నెలకు రూ.30 లక్షల వరకు రెంట్స్ వస్తాయని స్పష్టం చేశారు. శాసనసభకు స్థానికుడు అయితే బాగుంటుంది. లోక్ సభకు పరిచయాలు, పలుకుబడి ఉంటే సరిపోతుంది. అనకాపల్లిలో కొత్తగా ఓటు వచ్చిన లక్ష యాభై వేల మందికి ఉద్యోగాలు లేవు. వారందరికీ సీఎం రమేష్ ఎంపీ అయితే ఉద్యోగాలు కల్పిస్తారనే భావన ఉంది.
నాకు అందరితో పరిచయం ఉంది. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాతో ఉన్న సాన్నిహిత్యం, పారిశ్రామిక వేత్తలతో ఉన్న ఫ్రెండ్ షిప్ వల్ల తనపై ఓటర్లకు నమ్మకం ఉందన్నారు. దేశంలో ఏపీ సీఎం జగన్ తప్పా అందరితో పరిచయం ఉందని వివరించారు. అందరితో రెగ్యులర్‌గా మాట్లాడతానని స్పష్టం చేశారు.
Read Latest Election News or Telugu News