ABN Big Debate With RK: సీఎం రమేష్‌తో ఏబీఎన్ ఎండీ ఆర్కే బిగ్ డిబేట్.. ఇదొక సంచలనమే!
ABN , Publish Date - Apr 22 , 2024 | 01:47 PM
దమ్మున్న చానెల్ ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణ (ABN MD Radha Krishna) పెన్ను పట్టి ‘కొత్తపలుకు’ (Kothapaluku) రాసినా.. టీవీలో కూర్చుని ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ (Open Heart With RK) ఇంటర్వ్యూ చేసినా అదో సంచలనమే అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రజల మన్ననలు పొందింది. ఇప్పటి వరకూ ఎందరో సినీ, రాజకీయాలతో పాటు ఇతర రంగాల ప్రముఖులను ఇంటర్వ్యూ చేసి.. సంచలనమే సృష్టించారు...
దమ్మున్న చానెల్ ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణ (ABN MD Radha Krishna) పెన్ను పట్టి ‘కొత్తపలుకు’ (Kothapaluku) రాసినా.. టీవీలో కూర్చుని ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ (Open Heart With RK) ఇంటర్వ్యూ చేసినా అదో సంచలనమే అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రజల మన్ననలు పొందింది. ఇప్పటి వరకూ ఎందరో సినీ, రాజకీయాలతో పాటు ఇతర రంగాల ప్రముఖులను ఇంటర్వ్యూ చేసి.. సంచలనమే సృష్టించారు. ఇక కొత్తపలుకు గురించి అయితే ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆర్కే రాసిన ఒక్కో వ్యాసం ఒక్కో సంచలనం.. అంతకుమించి తెలుగు రాష్ట్రాలకు చెందిన కొందరు రాజకీయ నేతలకు ముచ్చెమటలు కూడా పట్టించిన సందర్భాలున్నాయ్. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్ సీజన్ కావడంతో ‘బిగ్ డిబేట్’ (ABN Big Debate With RK) అనే ప్రత్యేక కార్యక్రమంతో తెలుగు ప్రజలను అలర్ట్ చేయడానికి.. అభిమానులు, వీక్షకుల ఆకాంక్ష మేరకు మరోసారి బుల్లితెర ముందుకు వచ్చేస్తున్నారు ఆర్కే. వాస్తవానికి ఏబీఎన్ ఎండీ ఆర్కే చేసిన ఈ వినూత్న ప్రయత్నాలు ఇప్పటి వరకూ ఏ మెయిన్‌స్ట్రీమ్ చేయడానికి సాహసించలేదు.. బహుశా ఇకపైన కూడా కష్టమేనేమోనని విశ్లేషకులు చెబుతున్నారు.
కిక్కెక్కించే డిబేట్..
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. అధికార వైసీపీ (YSR Congress).. కూటమి (టీడీపీ, బీజేపీ, జనసేన) నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయ్. అధికార, ప్రతిపక్ష పార్టీలకు ఈ ఎన్నికలు డూ ఆర్ డైగా మారాయి. సరిగ్గా ఈ పరిస్థితుల్లో నేతల మనసులో ఏముంది..? గెలిస్తే ఏం చేయబోతున్నారు..? అసలు ఫలానా వ్యక్తికి ఎందుకు జనాలు ఓట్లేయాలి..? ఎందుకీ జంపింగ్‌లు..? ఇలా ఎన్నో ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు.. అభ్యర్థులకు ముచ్చెమటలు పట్టే సంచలనాలకు తెరదీసే ప్రశ్నలతో ‘బిగ్ డిబేట్’ కార్యక్రమం జరగబోతోంది. ఇవాళ్టి డిబేట్ ఎంతో కిక్కెక్కిస్తుందనడంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. బీజేపీ కీలక నేత, అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్‌తో ఇవాళ్టి బిగ్ డిబేట్. తెలుగుదేశం నుంచి బీజేపీలోకి ఎందుకు మారినట్టు..? తొలిసారిగా లోక్‌సభ బరిలోకి ఎందుకు దిగుతున్నట్లు.. ప్రత్యక్ష పోరులో గెలుస్తారా..? ఎక్కడో సీమ నుంచి ఉత్తరాంధ్రకు నాన్ లోకల్ కష్టాల మాటేమిటి..? కమలం పార్టీ అభ్యర్థిని అనకాపల్లి ఓటర్లు ఆదరిస్తారా..? జనాన్ని ఎలా ఆకట్టుకుంటారు..? వైసీపీని ఎలా ఎదుర్కొంటారు..? మిత్రుల్ని ఎలా కలుపుకొనిపోతారు..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలతో పాటు మరెన్నో ప్రశ్నలకు ఈ బిగ్ డిబేట్‌తో సమాధానాలు దొరకనున్నాయి. ఇవాళ (సోమవారం) రాత్రి 7 గంటలకు బిగ్ డిబేట్ వచ్చేస్తోంది.. ఇంకెందుకు ఆలస్యం సిద్ధంగా ఉండండి..!