Home » Accident
కొన్నిసార్లు కొందరి నిర్లక్ష్యం ఇంకొందరికి ప్రాణసంకటం అవుతుంటుంది. నిత్యం మన చుట్టూ అధికారులు వివిధ రకాల పనులు చేపడుతుంటారు. అయితే వాటి నిర్వహణలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. ఈ క్రమంలో...
తిరుమలగిరి మున్సిపాలిటీ అనంతారం బిక్కేరు వాగు వద్ద హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ద్విచక్రవాహనంతో సహా తండ్రీకుమార్తె వాగులో పడిన ఘటనలో కుమార్తె మృతిచెందగా.. తండ్రికి తీవ్రగాయాలు అయ్యాయి. దీంతో స్థానికంగా విషాద వాతావరణం నెలకొంది.
సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్‌కు చెందిన కొందరు యువకులు చేపట్టిన విహారయాత్ర విషాదంగా మిగిలింది. మహారాష్ట్రలోని పుణె సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు యువకులు అక్కడికక్కడే మరణించారు.
ఆదివారం కావడంతో సరదాగా జలపాతం చూసేందుకు వెళ్లిన కుటుంబం అందులో పడి గల్లంతైన ఘటన మహారాష్ట్రలోని లోనావాలా ప్రాంతంలో జరిగింది. అందులో తల్లి, ఇద్దరు పిల్లల మృతదేహాలు లభ్యం కాగా, మరో ఇద్దరు చిన్నారుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
కేంద్రపాలిత ప్రాంతం లడఖ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ట్యాంక్ ఎక్సర్సైజ్లో భాగంగా నది దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. లడఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖకు సమీపంలో నది దాటుతున్న సమయంలో ట్యాంక్ ప్రమాదానికి గురై ఐదుగురు సైనికులు మరణించారు
ఒక్క కార్మికుడు పనిలో చేసిన పొరపాటు.. పెను ప్రమాదానికి కారణమైంది! అద్దాలు తయారుచేసే పరిశ్రమలో రియాక్టర్ పేలి ఐదుగురు కార్మికులు మృతి చెందగా.. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు.
తెల్లవారుజామున కావడంతో లారీ డ్రైవర్ నిద్ర మత్తులో ఉన్నారో ఏమో కానీ పెను ప్రమాదం జరిగింది. ఒక లారీని వెనుక వస్తున్న లారీ ఢొకట్టింది. ఈ ప్రమాదంలో నలుగురుదుర్మరణం పాలయ్యారు. ఈ దుర్ఘటన మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం వద్ద బైపాస్ రోడ్డులో జరిగింది.
దేశరాజధానిలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఢిల్లీ(delhi)లోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో టెర్మినల్ 1లో కొంత పైకప్పు భాగం కుప్పకూలింది. కూలిన ప్రాంతం రోడ్డుపై పడటంతో అటుగా వచ్చిన పలు కార్లు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృత్యువాత చెందగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు.
అర్ధరాత్రి హఠాత్తుగా రోడ్డుపైకి వచ్చిన ఓ చిరుతను తప్పించబోగా కారు బోల్తా కొట్టింది.. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా.. కారు నడుపుతున్న ఆమె భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలో మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.
రాష్ట్రంలో మంగళవారం మూడు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందారు. కామారెడ్డి జిల్లా క్యాసంపల్లి గ్రామ పరిధిలో ఆగివున్న లారీని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టింది.