Home » Accident
కామారెడ్డి, మే 24: సాధారణంగా విద్యుత్ షాక్(Electric shock)తో ఒకరిద్దరూ మృతిచెందుతున్న ఘటనలు మనం తరచూ చూస్తుటాం... కానీ గ్రామ పంచాయతీలోని ప్రతి ఇంటికీ విద్యుత్ షాక్ వచ్చిన ఘటన కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం కొండాపూర్(Kondapur) గ్రామపంచాయతీ పరిధిలోని పలుగుట్ట తండాలో చోటు చేసుకుంది.
కుటుంబ సమేతంగా దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా కారు బోల్తా పడి భార్య మృతిచెందింది. భర్త పరిస్థితి విషమంగా ఉంది. గురువారం నల్లగొండ(Nalgonda) జిల్లా తిప్పర్తి మండల కేంద్రంలో ఈ సంఘటన జరిగింది. ఎస్ఐ రాజు తెలిపిన వివరాల ప్రకారం
దైవదర్శనానికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం(Road Accident) జరగడంతో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. జమ్మూకాశ్మీర్లో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది ఈ విషాద ఘటన.
మండలంలోని కోనాపురం శివార్లలో ఓ కారు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. డ్రైవర్ సురేష్ స్వల్పగాయాలతో బయటప డ్డాడు. రొద్దం మండలం చోళేమర్రి గ్రామానికి చెందిన సురేష్ కోనాపురం గ్రామంలో వివాహం చేసుకున్నాడు.
పుణెలో ఓ బాలుడు (17) మద్యం మత్తులో లగ్జరీ కారును అతి వేగంగా నడిపి... బైక్పై వెళుతున్న ఇద్దరు యువ సాఫ్ట్వేర్ ఇంజనీర్లను బలిగొన్న ఘటన, రోడ్డు ప్రమాదాలపై 300 పదాల్లో వ్యాసం రాయమంటూ ఆ బాలుడికి 15 గంటల్లోనే స్థానిక కోర్టు బెయిల్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.
హెలికాప్టర్ కూలిపోయిన దుర్ఘటనల్లో వివిధ దేశాలకు చెందిన అధ్యక్షులు పలువురు గతంలో ప్రాణాలు కోల్పోయారు. ఇంకొందరు ప్రజాదరణ పొందిన నాయకులూ మృతిచెందారు. ఫిలిప్పీన్స్ ఏడో అధ్యక్షుడిగా పనిచేస్తూ, అవినీతిపై ఉక్కుపాదం మోపిన రమోన్ మెగసెసే నుంచి ఉమ్మడి ఏపీకి సీఎంగా వ్యవహరించిన వైఎస్ రాజశేఖర్రెడ్డి వంటి వారు ఉన్నారు.
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణంపాలయ్యారు. ఆదివారం ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ భారీ వర్షాలు, దట్టమైన పొగమంచు, ఈదురుగాలులతో తూర్పు అజర్బైజాన్ ప్రావిన్స్లోని పర్వతాల మధ్య ఉన్న డిజ్మార్ అటవీ ప్రాంతంలో కూలిపోయిన విషయం తెలిసిందే.
ఛత్తీస్గఢ్ లోని కవార్థా జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న పికప్ వాహనం బోల్తాపడి 18 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 10 మంది గాయపడ్డారు. సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది.
ఇరాన్ రాజ్యాంగంలో గల ఆర్టికల్ 131 ప్రకారం అధ్యక్షుడు ఆకస్మాత్తుగా చనిపోతే ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్, పార్లమెంట్ స్పీకర్, న్యాయ విభాగ అధిపతితో కౌన్సిల్ ఏర్పాటు చేస్తారు. కౌన్సిల్ ప్రతిపాదన మేరకు ఉపాధ్యక్షుడు బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. ఖమేని ఆమోదం లభిస్తే వైస్ ప్రెసిడెంట్ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకుంటారు. అలా తాత్కాలిక ప్రభుత్వం కొనసాగుతోంది. 50 రోజుల్లోపు కొత్త అధ్యక్షుడి కోసం ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది.
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ గల్లంతైంది. పొరుగుదేశం అజర్బైజాన్, ఇరాన్లోని తూర్పు అజర్బైజాన్ ప్రావిన్స్ సరిహద్దుల్లో ఓ డ్యామ్ ప్రారంభోత్సవానికి ఆయన ఇరాన్ విదేశాంగ మంత్రి హుస్సేన్ ఆమిర్ అబ్దులాహియన్, అధికారులు, అంగరక్షకులతో కలిసి హెలికాప్టర్లో బయలుదేరారు.