Share News

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 7 మంది దుర్మరణం.. 20 మందికిపైగా తీవ్ర గాయాలు

ABN , Publish Date - May 24 , 2024 | 12:16 PM

దైవదర్శనానికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం(Road Accident) జరగడంతో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. జమ్మూకాశ్మీర్‌లో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది ఈ విషాద ఘటన.

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 7 మంది దుర్మరణం.. 20 మందికిపైగా తీవ్ర గాయాలు

కశ్మీర్: దైవదర్శనానికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం(Road Accident) జరగడంతో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. జమ్మూకాశ్మీర్‌లో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ విషాద ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షార్‌ ప్రాంతంలోని ఒకే కుటుంబానికి చెందిన 30 మంది వైష్ణో దేవి ఆలయ దర్శనం నిమిత్తం మినీ బ‌స్సులో జమ్మూకాశ్మీర్‌కి(Jammu Kashmir) బ‌య‌ల్దేరారు.

వీరు ప్రయాణిస్తున్న మినీ బ‌స్సు హరియాణాలోని అంబాలా వ‌ద్ద ట్రక్కును ఢీకొట్టింది. ట్రక్కుకు ముందు ఓ కారు వేగంగా వెళ్తూ.. పెట్రోల్ బంక్ వ‌ద్ద ఆక‌స్మాత్తుగా మ‌లుపు తిప్పింది. దీంతో దాని వెనకాలే వేగంగా వెళ్తున్న ట్రక్కు డ్రైవ‌ర్ ఆక‌స్మాత్తుగా బ్రేకులు వేశాడు. ట్రక్కుకు వెనకాలే వస్తున్న మినీ బస్సు డ్రైవ‌ర్.. వేగాన్ని నియంత్రించ‌లేక ట్రక్కును ఢీ కొట్టాడు.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

ఈ ఘటనలో 7 మంది అక్కడికక్కడే మృతి చెందారు. 20 మందికిపైగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో.. బంధువుల ఆర్తనాదాలు మిన్నంటాయి.

రక్తపు మడుగుల్లో పడి ఉన్న క్షతగాత్రులను చూసి బంధువులు గుండెలవిసేలా రోదించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కశ్మీర్ పోలీసులు తెలిపారు.

Read Latest News and National News here

Updated Date - May 24 , 2024 | 12:18 PM