Home » Adilabad District
పార్లమెంట్ ఎన్నికల్లో ఓటర్లందరూ తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని బెల్లంపల్లి రూరల్ సీఐ అఫ్జలుద్దీన్ అన్నారు. ప్రలోభాలకు గురికాకుండా ఇష్టమైన నాయకుడికి ఓటువేయలని కోరారు. మంగళవారం సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు.
కొమురంభీం: జిల్లాలో ఏనుగు అలజడి సృష్టించింది. చింతల మానేపల్లి మండలం, బూరెపల్లి శివారులో ఏనుగు దాడిలో రైతు మృతి చెందాడు. దీంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. మహారాష్ట్ర అటవీ ప్రాంతం నుంచి కొమురంభీం జిల్లాలోకి ఏనుగు ప్రవేశించింది.
Telangana Elections: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలపై బీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి సారించింది. అసెంబ్లీ ఎన్నికల్లో అట్టర్ ప్లాప్ అయ్యాక.. పార్లమెంట్ ఎన్నికల్లో అయినా పరువు కాపాడుకోవాలని శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం కచ్చితంగా ఆశించిన సీట్లను దక్కించుకోవాలని వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగానే ఎంపీ అభ్యర్థుల విషయంలో ఆచితేచి అడుగులు వేస్తోంది. ఇప్పటికే పలువురు ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్.. తాజాగా మరో రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు...
Telangana: జిల్లాలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన కొనసాగుతోంది. సోమవారం ఉదయం జిల్లాకు చేరుకున్న ప్రధానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహించిన సభలో మోదీ పాల్గొన్నారు. పర్యటనలో భాగంగా మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. రామగుండం ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ ప్రధాన మంత్రి జాతికి అంకితం చేశారు.
ఆదిలాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా పర్యటించనున్నారు. ముందుగా కేస్లాపూర్లో నాగోబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు.
ఆదిలాబాద్: మంత్రి సీతక్క మంగళవారం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. కెరమెరి మండలం, గొందిలో జంగు బాయిని మంత్రి దర్శించుకోనున్నారు. అనంతరం అభివృద్ధి పనులపై ఉట్నూర్ కేబి కాంప్లెక్స్లో ఉమ్మడి జిల్లా అధికారులతో సమీక్ష చేయనున్నారు.
గుడిహత్నూర్ మండలం మేకలగండి వద్ద జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఆటోలో నలుగురు ప్రయాణిస్తున్న అక్కడికక్కడే మృతి చెందింది. ఐదుగురికి గాయాలయ్యాయి.
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) సెంట్రల్ కమిటీ, పొలిట్ బ్యూరో మెంబర్, భారత విప్లవ ఉద్యమ నాయకుడు కటుకం సుదర్శన్ అలియాస్ ఆనంద్, అలియాస్ దూలా (69) మృతి చెందారు.
ఆసిఫాబాద్ రూరల్, జూన్ 3: రైతు సంక్షేమమే ప్రభు త్వ ధ్యేయమని ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతవరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా శనివారం మండలంలోని జక్కాపూర్, బూర్గుడ, రహపల్లి, చిర్రకుంట, బాబాపూర్, వావుదాం రైతువేదికల్లో రైతు దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు.
భానుడు నిప్పులు చెరిగాడు. ఎండకు తోడు వడగాలులతో జనం అల్లాడారు. మధ్యాహ్నానికి రోడ్లన్నీ బోసిపోయాయి. రోహిణికి ముందే ఎండలు ఇలా ఉంటే రోహిణికార్తెలో ఇంకెలా ఉంటాయోనని..