Home » Adilabad
సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటుకు 2024 సంవ త్సరానికి సేప్టీ ఎక్సలెన్స్-పవర్ థర్మల్ సెక్టర్ విభాగంలో 1వ గ్రీన్ ఎన్విరో సేఫ్టీ అవా ర్డు, గోల్డ్ అవార్డు లభించినట్లు ఎస్టీపీపీ ఈడీ రాజశేఖర్‌రావు ఆదివారం పేర్కొన్నారు.
మానవ వ్యర్థాలతో ఎరువును తయారు చేసే ప్రక్రియకు ఆది నుంచి ఆటంకాలు ఎదురవుతున్నాయి. 2021లో అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎఫ్‌ఎస్‌టీపీ (ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్)లను నెలకొల్పేందుకు స్థలాలు కేటాయించాలని మున్సిపాలిటీలకు ఆదేశాలు జారీ చేసింది. సుమారు ఐదు సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు ఆ దిశగా కార్యాచరణ జరుగకపోగా, స్థలాల ఎంపిక కొలిక్కి రాలేదు.
జిల్లాలో మాతా శిశు మరణాల నియంత్రణకు అర్మాన్ సంస్థ ద్వారా ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ ఇస్తున్నట్లు డీఎంహెచ్‌వో హరీష్‌రాజ్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లాలోని 230 మంది ఆరోగ్య కార్యకర్తలకు అర్మాన్ సంస్థ ఇస్తున్న శిక్షణను ప్రారంభించారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం కాంగ్రెస్ పార్టీ ప్రాణహిత, కుప్తి, మందాకిని ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలని వామపక్ష ప్రజా సంఘాల నాయకులు పేర్కొ న్నారు. శుక్రవారం మంచిర్యాలలో వారు మాట్లాడుతూ ఎన్నికల ముం దు సీఎం రేవంత్‌రెడ్డి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని చెప్పి మర్చిపోయారన్నారు.
ఆది వాసీ కుటుంబాల సంక్షేమమే పోలీసుల ధ్యేయ మని మంచిర్యాల డీసీపీ భాస్కర్ అన్నారు. శుక్రవారం మాదారం పోలీస్‌స్టేషన్ పరిధిలోని నర్సాపూర్ (బెజ్జాల) గ్రామంలో తాండూర్ సర్కిల్ పోలీసులు, రెడ్‌క్రాస్ సొసైటీ సహకా రంతో కమ్యూనిటీ కాంటాక్టు కార్యక్రమంలో భాగంగా పోలీసులు మీ కోసం కార్యక్రమం నిర్వహించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను దగా చేస్తోందని బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు రాజారమేష్ పేర్కొన్నారు. శుక్ర వారం ఆదిల్‌పేట గ్రామంలో ఇంటింటికి పోస్టర్లను అం టించి నిరసన తెలిపారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ప్రభుత్వపరంగా చేపడుతున్న పలు అభివృద్ధి పనుల పేరుతో ఇసుకను తరలిస్తున్న వ్యాపారులు దాన్ని పక్కదారి పట్టించి పెద్ద మొత్తంలో ప్రైవేటులో అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు.
విద్యార్థులకు నాణ్యమైన భోజ నం అందించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉపాధ్యాయులు బోధిస్తున్న తీరును పరిశీలించారు. విద్యార్థినుల విద్యా సామర్ధ్యాలను పరిశీలించి సమస్యలను తెలుసుకు న్నారు.
రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్ద పీటవేస్తోందని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీ కృష్ణ అన్నారు. గురువారం సింగరేణి ఠాగూర్ స్టేడి యంలో అస్మిత ఖేలో ఇండియా అండర్ -13 ఉమెన్స్ పుట్‌బాల్ లీగ్ 2024-2025 టోర్నమెం ట్‌ను ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
సీసీఐ అధికారులు, జిన్నింగు మిల్లు యజ మానులు దళారులకు కొమ్ము కాస్తున్నారని పత్తి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం రేపల్లెవాడలోని జిన్నింగు మిల్లు యజమానులతో వాగ్వాదానికి దిగా రు. రైతులు మాట్లాడుతూ పత్తి మిల్లు వద్ద రైతుల కంటే వ్యాపారులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.