Home » Adilabad
పట్టణంలో బీజేపీ నాయకుడు మెట్టుపల్లి జయరామారావుపై కాంగ్రెస్ గుండాలు దాడి చేశారని, దాడి చేసిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి పేర్కొన్నారు. గురువారం బీజేపీ కార్యాల యం నుంచి డీసీపీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి డీసీపీకి వినతిపత్రం అందించారు.
సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జిల్లాలో కోడి పందాల జోరు కొనసాగుతోంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో పందేలు ఆడుతూ ఆదివారం పలువురు పందెం రాయుళ్లు పోలీసులకు పట్టుబడ్డారు. కోడి పందేల బెట్టింగులు జిల్లాలో జోరుగా సాగుతున్నాయి.
మంచిర్యాల పట్టణం గోదావరి రోడ్డులో చేపట్టిన మహా ప్రస్తాన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు అధికారులను ఆదేశించారు. పనులను పరిశీలించిన అనంతరం మంచిర్యాల మార్కెట్ ఏరియాలో పర్యటించారు. మార్కెట్ ఏరియాలో రోడ్డు విస్తరణ పనులు మంద కొడిగా సాగుతున్నాయని, అధికారులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
గోదాదేవి రంగనాథుల కల్యాణాన్ని కన్నుల పండగగా నిర్వహించారు. భాజభజంత్రీలు, మంగళవాయిద్యాలు, భక్తుల కోలాహలం నడుమ కల్యాణం కమనీయంగా జరిగింది. ఆలయ అర్చకులు మోహనాచారి ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య నిర్వహించారు.
సమస్యలు పరిష్కరించాలని సోమవారం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్టు కార్మి కులు ఆకులు తింటూ నిరసన తెలిపారు. సీఐటీ యూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రమణ, రంజిత్ కుమార్‌లు మాట్లాడుతూ ఆసుపత్రిలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ కార్మికులకు యూనిఫాం, గుర్తింపు కార్డులు ఇవ్వడం లేదని, వేతనాల చెల్లింపుల విష యంలో అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు.
వేలాల గ్రామంలో గట్టు మల్లన్న గుట్టమీద సోమవారం చిలుకూరి బాలాజీ శివాలయం ప్రధాన అర్చకులు సురేష్ ఆత్మరాం మహారాజ్ ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణ నిర్వహించారు. భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు.
కాంట్రాక్టర్ల ధనదాహానికి కొండలు కరిగిపోతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకపోయినా అక్రమంగా గుట్టను తవ్వి మట్టిని తరలించుకుపోతున్నా అడిగేవారు లేరు. కాంట్రాక్టర్లకు రాజకీయ నాయకుల మద్దతు ఉండడంతో మైనింగ్ అధికారులు పట్టించుకోవడం లేదు.
పాత మంచిర్యాలలో శాలివాహన పవర్ ప్లాంటును మూసివేసి ఆ భూమిని అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారని ప్లాంటులో పని చేస్తున్న కార్మికులు ఆదివారం గేటు ఎదుట నిరసన వ్యక్తం చేశారు.
ఉపాధ్యాయులు ఎదుర్కొం టున్న సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానని పీఆర్‌టీయూ టీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులగం దామో దర్ రెడ్డి అన్నారు. సీసీసీలోని ఎంఎం గార్డెన్‌లో ఆదివారం పీఆర్‌టీయూ టీఎస్ జిల్లా అధ్యక్షుడు కొట్టె శంకర్ అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశం జరి గింది.
దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద అని జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి కీర్తి రాజ్‌వీరు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కాలేజీ రోడ్డులోని స్వామి వివేకానంద విగ్రహా నికి పూలమాలలువేసి నివాళులర్పిం చారు.