Share News

Adinarayana Reddy: జగన్‌కు స్కాంలు మాత్రమే తెలుసు.. ఆదినారాయణ రెడ్డి విసుర్లు

ABN , Publish Date - Mar 29 , 2025 | 05:24 PM

Adinarayana Reddy: మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. జగన్, అవినాష్ రెడ్డిలకు వివేకా హత్య కేసులో ప్రమేయం లేదా అని ప్రశ్నించారు. ముందు వివేకా హత్య కేసులో వారిద్దరూ ముద్దాయిలు కాదని తేల్చండి అని ఆదినారాయణ రెడ్డి సవాల్ విసిరారు.

Adinarayana Reddy: జగన్‌కు  స్కాంలు మాత్రమే తెలుసు.. ఆదినారాయణ రెడ్డి  విసుర్లు
Adinarayana Reddy

కడప: మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైనాట్ 175 అని 11స్థానాలకు దిగజారిపోయారని.. మళ్లీ పోటీచేస్తే ఆ ఉన్న 11సీట్లు కూడా వైసీపీకి రావని విమర్శలు చేశారు. ఏపీలో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని ఉద్ఘాటించారు. జగన్ చేసిన అప్పుల దరిద్రమే ఈ పథకాల అమలుకు ఆలస్యం అవుతుందని చెప్పారు. ఎన్నో సంక్షేమ పథకాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందని ఉద్ఘాటించారు. భవిష్యత్ ఎన్నికల్లో అవినాష్‌ను ఎంపీగా, జగన్‌ను ఎమ్మెల్యేగా ఒడిస్తానని అన్నారు. జగన్‌కు స్కీంలు తెలియవు.. స్కాంలు మాత్రమే తెలుసునని ఆరోపించారు. జగన్, అవినాష్‌లు లోపలకు పోయే టైమ్ ఆసన్నమైందని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి హెచ్చరించారు.


అవినాష్ మాటలు విడ్డూరంగా ఉన్నాయి..

‘జగనన్నను చూసి అధికారులు పరిగెత్తారని అవినాష్ చెప్పడం విడ్డురంగా ఉంది. ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు చెప్పడంలో వాళ్లు దిట్టలు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ జరిగింది.. జగన్, అవినాష్‌లకు అంతా తెలుసు. అవినాష్ రెడ్డికి వివేకా కేసులో ప్రమేయం లేదా. పాడా నిధులు రూ.800 కోట్లు వాడుకున్నారు. చిత్రావతి నీళ్లు పులివెందులకే చేరలేదు. అయిదు రోజుల క్రితం జగన్‌పై నేను చేసిన వాఖ్యలపై ఎంపీ అవినాష్ స్పందించారు. నన్ను బాగా గమనిస్తున్నారు. వాళ్ల కుటుంబ సభ్యులు చనిపోతారని మాకేమైనా ముందే తెలుసా. వచ్చిన ప్రతిసారి రెండేళ్లలో మళ్లీ అధికారంలోకి వస్తానని అంటున్నావ్..నువ్వు కేసుల్లో ఇరుక్కున్నావు. వివేకా హత్య మీకు తెలిసి జరిగింది కాదా..మీరు మీరు కొట్లాడుకొని మామీద పడి చచ్చారు ఎందుకు.. అయిదు రోజులు నేను కనపడటం లేదని.. క్లబ్‌లో ఉంటాడని వారు ఆరోపించారు. రూ.800 కోట్ల పాడా నిధులు వాడుకుని బిల్లులు చెల్లించలేదు. కడపకు నువ్వు ఏమి చేశావ్... కడపకు జేఎస్‌డబ్ల్యూ ఆధ్వర్యంలో స్టీల్ ఫ్యాక్టరీ రాబోతుంది. 30ఏళ్లు నువ్వు వచ్చేది లేదు.. సచ్చేది లేదు. మీరిందరూ ఇంట్లో లెక్క ఒక్క పైసా బయటకు తీయరు.. సాయం చేయరు. ఆ పథకాలు అవినాష్ రెడ్డికి ఏమైనా తెలుసా..గత జగన్ ప్రభుత్వంలో సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వలేదు. ఇప్పుడు అమలు చేస్తున్నాం. ముందు వివేకా హత్య కేసులో మీరు ముద్దాయిలు కాదని తేల్చండి’ అని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సవాల్ విసిరారు.


ఈ వార్తలు కూడా చదవండి

AP News: కొలిక్కి రాని కొలికపూడి ఇష్యూ.. తిరువూరులో ఉత్కంఠ..

Good News To Youth: ఉద్యోగాల పండగ.. టీడీపీ ఆవిర్భావ వేడుకల్లో సీఎం గుడ్‌న్యూస్

CM Chandrababu: ప్రజా సేవకు పునరంకితం అవుతామని సంకల్పం చేస్తున్నా...

For More AP News and Telugu News

Updated Date - Mar 29 , 2025 | 05:32 PM