Home » Amaravati
దుష్టుడైన మహిషాసరుడిని అంతమొందించిన భీకర శక్తి స్వరూపిణి మహిషాసుర మర్థిని రూపంలో ఇంద్రకీలాద్రిపై అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఎనిమిది భుజములు.. అష్ట ఆయుధాలు... సింహవాహినిగా.. రౌద్ర రూపంలో వున్న అమ్మవారిని దర్శించుకుంటే.. శత్రు భయం వుండదని భక్తుల విశ్వాసం.
విశ్వవిద్యాలయాల ఉపకులపతుల(వీసీ) నియామకం విషయంలో నామినీల కొరత కనిపిస్తోంది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఒకేసారి 17 యూనివర్సిటీల వీసీ పోస్టులు ఖాళీ అయ్యాయి.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పీపీపీ(ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం) రహదారుల ప్రాజెక్టులపై అధ్యయనం కోసం నిపుణుల కమిటీ ఏర్పాటైంది.
గత వైసీపీ ప్రభుత్వం ప్రచార పిచ్చితో రేషన్ కార్డులను కూడా తమ పార్టీ రంగులతోనే నింపేసింది. వాటిపై ఒకవైపు వైఎస్ రాజశేఖరరెడ్డి, మరోవైపు జగన్ బొమ్మలు ముద్రించి లబ్ధిదారులకు పంపిణీ చేసింది.
ఆ కంపెనీని జగన్ జమానాలో వైసీపీ నేతలు అడ్డగోలుగా ప్రోత్సహించారు. సొసైటీ చట్టం కింద అర్హత లేకున్నా ఐదేళ్లూ కర్నూలులో ఆ కంపెనీకే డీ-సిల్టింగ్ కాంట్రాక్టు పనులు కట్టబెట్టారు.
మద్యం పాలసీ అమలులోకి రాకముందే దరఖాస్తు రుసుము రూపేణా ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చింది. రాష్ట్రంలోని 3,396 షాపులకు గురువారం సాయంత్రానికి 65,629 దరఖాస్తులు వచ్చాయి.
రాష్ట్రంలో నాలుగు నెలల పాలనలోనే రూ.60 వేల కోట్ల ప్రాజెక్టులు సాధించి.. సంపద సృష్టించామని టీడీపీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్‌కుమార్ వెల్లడించారు.
ప్రభుత్వ వైద్యులు, సిబ్బంది నిర్ణీత పని వేళలు పాటించకపోవడంపై ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
కొందరు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ప్రభుత్వం కళ్లు గప్పి ఇసుక దోపిడీ చేస్తున్నారు. కృష్ణా, గోదావరి, పెన్నా, తుంగభద్ర నదుల్లో ఇసుక తవ్వకాలు సాగిస్తున్నారు. రెండు టన్నుల బకెట్ సామర్థ్యం గల జేసీబీలు ఉపయోగించి నదులను గుల్ల చేస్తూ ఇసుక తోడేస్తున్నారు.
జగన్ జమానాలో అసెంబ్లీ చీఫ్ మార్షల్‌గా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న థియోఫిలస్ పదోన్నతికి బ్రేక్ పడింది. ఆయనపై ఎలాంటి విచారణ లేదన్నట్లు పదోన్నతి జాబితాలో పేరు చేర్చిన విషయంపై ‘అలా వదిలేస్తే ఎలా’ శీర్షికతో గురువారర ‘ఆంధ్రజ్యోతి’లో వార్త ప్రచురించిన సంగతి తెలిసిందే.