Share News

Amaravati : థియోఫిలస్‌ పదోన్నతికి బ్రేక్‌

ABN , Publish Date - Oct 11 , 2024 | 03:41 AM

జగన్‌ జమానాలో అసెంబ్లీ చీఫ్‌ మార్షల్‌గా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న థియోఫిలస్‌ పదోన్నతికి బ్రేక్‌ పడింది. ఆయనపై ఎలాంటి విచారణ లేదన్నట్లు పదోన్నతి జాబితాలో పేరు చేర్చిన విషయంపై ‘అలా వదిలేస్తే ఎలా’ శీర్షికతో గురువారర ‘ఆంధ్రజ్యోతి’లో వార్త ప్రచురించిన సంగతి తెలిసిందే.

Amaravati : థియోఫిలస్‌ పదోన్నతికి బ్రేక్‌

  • అసెంబ్లీ చీఫ్‌ మార్షల్‌గా ఆయనపై తీవ్ర ఆరోపణలు

  • అయినా ప్రమోషన్‌ ఫైలు ముందుకు.. ‘ఆంధ్రజ్యోతి’ కథనంతో ఆగిన వైనం

  • జగన్‌ జమానాలో అసెంబ్లీ చీఫ్‌ మార్షల్‌గా ఆయనపై తీవ్ర ఆరోపణలు, ఫిర్యాదులు

  • అయినా ప్రమోషన్‌ ఫైలు ముందుకు‘ఆంధ్రజ్యోతి’ కథనంతో ఆగిన వైనం

అమరావతి, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): జగన్‌ జమానాలో అసెంబ్లీ చీఫ్‌ మార్షల్‌గా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న థియోఫిలస్‌ పదోన్నతికి బ్రేక్‌ పడింది. ఆయనపై ఎలాంటి విచారణ లేదన్నట్లు పదోన్నతి జాబితాలో పేరు చేర్చిన విషయంపై ‘అలా వదిలేస్తే ఎలా’ శీర్షికతో గురువారర ‘ఆంధ్రజ్యోతి’లో వార్త ప్రచురించిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ చీఫ్‌ మార్షల్‌గా థియోఫిలస్‌ గత ప్రభుత్వంలో చూపిన భక్తి, సర్వీసులో చేసిన అక్రమాలు, ఆయనపై ఉన్న ఆరోపణలు, అభియోగాలు ప్రస్తావించింది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసు పెద్దలు థియోఫిలస్‌ సామాన్యుడు కాదని గుర్తించి గురువారం ఇవ్వాల్సిన పదోన్నతికి బ్రేక్‌ వేశారు. ఏపీఎస్పీలో పదహారు మంది అసిస్టెంట్‌ కమాండెంట్లకు అడిషనల్‌ కమాండెంట్లుగా రాష్ట్ర హోం శాఖ పదోన్నతి కల్పించింది.

ఈ జాబితాలో ఆయన పేరు కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్‌ పోలీసు శాఖలో అంతర్భాగమైన ఏపీఎస్పీలో ఆయన పదకొండో బెటాలియన్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌. రాష్ట్రంలో 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఆయన్ను అసెంబ్లీ చీఫ్‌ మార్షల్‌గా నియమించారు. ఎన్ని పనులు చేయకూడదో అన్నీ చేశారు. 2022లో ప్రతిపక్ష నేత చంద్రబాబును అసెంబ్లీ ప్రాంగణంలోనే అడ్డుకున్న ఘనత ఆయన సొంతం. శాసనమండలి చైర్మన్‌ కదలికలు గమనించేలా ఆయన కెమెరాను తిప్పారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు పాత అవమానాలు మరిచిపోయారు. ఇదే అదనుగా తన ప్రమోషన్‌ కోసం థియోఫిలస్‌ అన్నీ చక్కబెట్టుకున్నారు.

Updated Date - Oct 11 , 2024 | 03:41 AM