Home » America
తెలంగాణలో భారీ పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి అమెరికా టూర్ విజయవంతంగా కొనసాగుతోంది. యూఎస్‌లోని ప్రముఖ కంపెనీల అధినేతలు, ప్రతినిధులతో రేవంత్ రెడ్డి బృందం వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు.
తెలంగాణకు ‘ఫ్యూచర్ స్టేట్’ అనే ట్యాగ్‌లైన్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖరారు చేశారు. ఈ ఫ్యూచర్ స్టేట్ ప్రాజెక్టుల్లో భాగస్వామి అయ్యేందుకు ప్రముఖ టెక్ దిగ్గజం అడోబ్ సంస్థ సానుకూలత వ్యక్తం చేసింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో బిజీగా ఉన్నారు. వరసగా కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు. రాష్ట్రానికి రావాలని, పెట్టుబడులు పెట్టాలని కోరుతున్నారు. రాష్ట్రానికి వస్తే తగిన మౌలిక వసతులు కల్పిస్తామని, రాయితీ ఇస్తామని ఆఫర్ చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు అమెరికా పర్యటనలో మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.
అమెరికాలో గుర్తింపు పొందిన ఉన్నత విద్యాసంస్థల నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి జాబ్ ఆఫర్ పొందిన విద్యార్థులు పని ఆధారిత నాన్-ఇమిగ్రెంట్ వీసాలు పొందడం సులభతరం కానుంది.
బంగ్లాదేశ్‌లో మైనారిటీలైన హిందువులపై జరుగుతున్న దాడులను భారతీయ అమెరికన్ చట్టసభ (కాంగ్రెస్) సభ్యులు రో ఖన్నా, రాజా కృష్ణమూర్తి ఖండించారు.
అమెరికాలో స్వచ్ బయోకంపెనీ నిర్వహిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకువస్తే.. బీఆర్ఎస్ నేతలు దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ మండిపడ్డారు.
ఆర్థికపరమైన సేవల్లో పేరొందిన అమెరికా బహుళ జాతి సంస్థ చార్లెస్ స్క్వాబ్ కంపెనీ హైదరాబాద్‌లో టెక్నాలజీ డెవల్‌పమెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
Telangana: తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యాంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన సాగుతోంది. ఇప్పటికే పలు కంపెనీల ప్రతినిధులతో రేవంత్ బృందం భేటీ అయ్యింది. తాజాగా ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో ప్రపంచంలో పేరొందిన చార్లెస్ స్క్వాబ్ కంపెనీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి చర్చలు నిర్వహించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటకు వెళ్లింది ఆయన తమ్ముళ్ల వ్యాపారం కోసమేనని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ఆరోపించారు.
రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయం.. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఘనవిజయం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న కీలకమైన నాలుగు ప్రాజెక్టులకు ప్రపంచబ్యాంకు సహకారం లభించింది.