Share News

CM Revanth Reddy: సాధించిన రేవంత్ రెడ్డి.. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌కు..!

ABN , Publish Date - Aug 08 , 2024 | 12:49 PM

Telangana: తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యాంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన సాగుతోంది. ఇప్పటికే పలు కంపెనీల ప్రతినిధులతో రేవంత్ బృందం భేటీ అయ్యింది. తాజాగా ఫైనాన్షియల్ సర్వీసెస్లో ప్రపంచంలో పేరొందిన చార్లెస్ స్క్వాబ్ కంపెనీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి చర్చలు నిర్వహించారు.

CM Revanth Reddy: సాధించిన రేవంత్ రెడ్డి.. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌కు..!
Charles Schwab

హైదరాబాద్, ఆగస్టు 8: తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యాంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అమెరికా పర్యటన (America Tour) సాగుతోంది. ఇప్పటికే పలు కంపెనీల ప్రతినిధులతో రేవంత్ బృందం భేటీ అయ్యింది. తాజాగా ఫైనాన్షియల్ సర్వీసెస్లో ప్రపంచంలో పేరొందిన చార్లెస్ స్క్వాబ్ కంపెనీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి చర్చలు నిర్వహించారు. ఈ సందర్భంగా చార్లెస్ స్క్వాబ్ కంపెనీ (Charles Schwab) హైదరాబాద్‌లో (Hyderabad) టెక్నాలజీ డెవలప్​మెంట్​ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. భారత్‌లోనే ఈ కంపెనీ నెలకొల్పే మొదటి సెంటర్‌ ఇదే కావటం విశేషం.

Rammohan Naidu: కేంద్రమంత్రి రామ్మోహన్‌ను అభినందించిన లోక్‌సభ స్పీకర్


Revanth-Reddy-America.jpg

అమెరికా పర్యటనలో భాగంగా డల్లాస్‌‌లో రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్​బాబుతో ఈ కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు డెన్నిస్ హోవార్డ్, రామ బొక్కా సారథ్యంలో ప్రతినిధులు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా టెక్నాలజీ అండ్ డెవెలప్​మెంట్​ సెంటర్ ఏర్పాటుపై కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. హైదరాబాద్‌లో ఈ కేంద్రం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. కంపెనీ కార్యకలాపాలను వేగవంతం చేసేందుకు అవసరమైన మార్గదర్శనం చేస్తామని చెప్పారు. తమ కంపెనీ విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతుకు కంపెనీ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ టెక్నాలజీ సెంటర్‌ ఏర్పాటుకు ఛార్లెస్ స్క్వాబ్ తుది అనుమతుల కోసం వేచి చూస్తోంది. త్వరలోనే తమ ప్రతినిధి బృందాన్ని హైదరాబాద్‌కు పంపించనున్నట్లు తెలిపింది. ఈ కంపెనీ విస్తరణతో ఆర్థిక సేవల రంగంలోనూ హైదరాబాద్ ప్రపంచం దృష్టిని ఆకర్షించనుంది.

revanth-america-charles1.jpg

Shaktikanta Das: రేపో రేటు యథాతథం..



నేటి పర్యటన వివరాలు..

నేటి అమెరికా పర్యటనలో భాగంగా రేవంత్.. ఆపిల్ సంస్థ హెడ్ క్వార్టర్ ఆపిల్ పార్క్ వెళ్లనున్నారు. ఆపిల్ మ్యానిఫాక్చర్ టీమ్‌తో సీఎం, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ కానున్నారు. ట్రినేట్ కంపెనీ సీఈఓతో చర్చించనున్నారు. ఆరమ్ గ్రూప్ ఆఫ్ కంపెనీతో భేటీ అయి హైదారాబాద్‌లో ఆ కంపెనీ డేటా సెంటర్స్ విస్తరణ కోసం చర్చలు నిర్వహించనున్నారు. పలువురు టెక్ కంపెనీల ప్రతినిధులతో లంచ్ మీటింగ్‌లో పాల్గొననున్నారు. అంగెన్ సంస్థ సీనియర్ లీడర్‌షిప్‌తో పెట్టుబడులపై చర్చలు నిర్వహించనున్నారు. ఎలక్ట్రానిక్ పరికరాల సంస్థ రెనేశాస్ తో, మ్యానిఫాక్చర్ సంస్థ అమాట్‌తో ఇన్వెస్ట్‌మెంట్‌పై చర్చలు నిర్వహించనున్నారు. పలు బిజినెస్ సంస్థలతో రౌండ్ టేబుల్ సమావేశంలో రేవంత్ పాల్గొననున్నారు.


ఇవి కూడా చదవండి...

AP News: విశాఖలో ఎన్నికలకు నో బ్రేక్.. ఈసీ గ్రీన్ సిగ్నల్

RJ Shekhar: జూబ్లీహిల్స్ పీఎస్‌లో ఆర్జే శేఖర్ బాషాపై కేసు నమోదు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 08 , 2024 | 01:34 PM