Home » Amit Shah
ప్రజలు మెచ్చిన దిగ్గజ పారిశ్రామికవేత్త.. టాటా గ్రూప్ గౌరవ అధ్యక్షుడు.. రతన్ టాటా అంత్యక్రియలు గురువారం ప్రభుత్వ లాంఛనాలతో, ముంబైలోని వర్లీ దహనవాటికలో జరిగాయి.
రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాద నిర్మూలనకు సహకరించాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు రాష్ట్ర హోం మంత్రి అనిత విజ్ఞప్తి చేశారు.
నక్సలైట్లతో యుద్ధం అంతిమ దశలో ఉందని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి సమాజంలోని చివరి వ్యక్తికీ చేరాలంటే నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించడం అవసరమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు.
సోమవారం న్యూఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హోం శాఖ మంత్రులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 2023, మార్చి 31వ తేదీ నాటికి దేశంలో నక్సలిజం అంతం, అర్బన్ నక్సల్స్ అంశాలపై చర్చించారు.
పోలీసు శాఖ సామర్ధ్యాన్ని పెంపొందించడంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాలు చాలా బాగా పనిచేశాయని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రశంసలు కురిపించారు. హింసతో ఏదీ సాధించలేం, జనజీవన స్రవంతిలో.. కలవాలని మావోయిస్టులకు అమిత్‌షా పిలుపునిచ్చారు.
National: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇజ్రాయెల్ మోడల్‌ను అమలు చేస్తున్నారని మండిపడ్డారు. అన్నలు ఆలోచించాలని.. మారిన పరిస్థితులకు అనుగుణంగా ఉద్యమాల్లో మార్పులు తెచ్చుకోవాలని సూచించారు. ప్రజలతో కలిసి అన్నలు పోరాడాలని అన్నారు.
మావోయిస్టులే టార్గెట్‌గా కేంద్ర ప్రభుత్వం వడివడిగా చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగానే ఇవాళ( సోమవారం) మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంశాఖ సమీక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ నుంచి హోంమంత్రి వంగలపూడి అనిత హాజరయ్యారు.
వామపక్ష తీవ్రవాదంపై కేంద్రం ఉక్కుపాదం మోపింది. 2026 మార్చి నాటికి భారత్‌ను వామపక్ష తీవ్రవాద రహిత దేశంగా ప్రకటిస్తామన్న కేంద్రం గత పదేళ్లలో నక్సల్స్ ఏరివేతే లక్ష్యంగా ఎన్నో ఆపరేషన్లు చేసింది.
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కార్మిక సంఘాల్లో నెలకొన్న ఆందోళనను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఆదివారం అమరావతిలోని క్యాంప్ కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నేతలు సమావేశమయ్యారు.
కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో రేపు(సోమవారం) మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలతో సమీక్ష సమావేశం జరగనుంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ ప్రత్యేక సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలు, హోంమంత్రులు, సీఎస్‌లు, డీజీపీలు హాజరుకానున్నారు.