Home » Anakapalli
అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కొప్పుగొండుపాలెంలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికను శనివారం దారుణంగా హత్య చేసిన నిందితుడు బోడా బత్తుల సురేశ్ (26) కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.
గత వైసీపీ ప్రభుత్వంలో తనపై 23కేసులు బనాయించారని హోంమంత్రి అనిత(Home Minister Vangalapudi Anitha) అన్నారు. అందులో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వం ఉపాధ్యాయులను వేధింపులకు గురిచేసిందని, మద్యం దుకాణాల ఎదుట వారిని కాపలాగా పెట్టారని దుయ్యబట్టారు. జగన్ అరాచకాలు భరించలేక గతంలో ఎన్నడూ లేని విధంగా ఉపాధ్యాయులు సైతం రాజకీయాలపై దృష్టి పెట్టి వైసీపీని ఇంటికి సాగనంపారని చెప్పారు.
కొప్పుగుండుపాలెం(Koppgundupalem)లో బాలిక హత్యపై హోం మంత్రి వంగలపూడి అనిత(Home Minister Vangalapudi Anitha) సీరియర్ అయ్యారు. ఈ ఘటన దురదృష్టకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడి కోసం ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగినట్లు హోంమంత్రి అనిత చెప్పారు. పరారీలో ఉన్న నిందితుణ్ని ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదని అనిత అన్నారు.
అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం కృష్ణాదేవిపేటలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పార్కు...
అల్లూరి జిల్లా: గిరి పుత్రుల ఆరాధ్య దేవత శ్రీ మోదకొండమ్మ ఉత్సవాలు ఆదివారం ఉదయం పాడేరులో ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు మూడు రోజులపాటు జరగనున్నాయి. అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని, పాదాలు, ఘట్టాలతో సతకంపట్లు వరకు బారిగా ఊరేగించారు.
ఏపీలో ఎన్నికల ఫలితాలపై ఆరా సంస్థ తన పోస్ట్‌పోల్ సర్వేను విడుదల చేసింది. ఏపీలో బీజేపీ మూడు లోక్‌సభ స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్, నరసాపురం నుంచి శ్రీనివాస వర్మ గెలిచే అవకాశాలు ఉన్నట్లు ఆరా సర్వేలో తేలిందన్నారు.
విశాఖ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గురు, శుక్రవారాలు కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారిణి సునంద పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ నిన్న ఒంగోలులో 43 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు అయిందని, విశాఖలో అత్యధికంగా 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయిందని తెలిపారు.
అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి మొత్తం 15మంది అభ్యర్థులు పోటీచేస్తున్నారు. వీరిలో ప్రధానపార్టీలకు చెందిన అభ్యర్థులు నలుగురు కాగా.. మిగతా అభ్యర్థులంతా రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మధ్య ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నిప్పు రాజేస్తోంది. ఈ అంశంపై అధికార, ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించుకుంటున్నాయి.
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతుండటంతో ఎన్డీఏ కూటమి ప్రచారంలో దూసుకెళ్తుంది. ప్రచారంలో భాగంగా ఈరోజు (సోమవారం) ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) ఏపీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాజమండ్రి, అనకాపల్లిలో సభల్లో పాల్గొని మోదీ ప్రసంగించారు. ఈ సభకు లక్షల సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చారు. ఈ వేదికల్లో అధికార వైసీపీ, సీఎం జగన్ రెడ్డిపై మోదీ తీవ్ర విమర్శలు గుప్పించారు.