Home » Anakapalli
Andhrapradesh: జిల్లాలోని జరిగిన చేయూత బహిరంగ సభలో ఓ దళిత మహిళ నిరసనకు దిగింది. తన కొడుకుని హత్య చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ సీఎం జగన్ పర్యటనలో బంధువులతో కలిసి దళిత మహిళ నిరసన తెలిపింది. హత్యకు గురైన సోమాదుల రవితేజ ఫొటోతో నిరసన చేపట్టారు.
Andhrapradesh: ఎన్నికల్లో పోటీపై మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం అనకాపల్లి జిల్లాలో నిర్వహించిన చేయూత బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ... ఈ ఎన్నికల్లో అవసరమైతే పోటీ నుంచి తప్పకుంటానని స్పష్టం చేశారు. అనకాపల్లి సమన్వయకర్తగా మలసాల భరత్‌ను నియమించారని తెలిపారు. ‘‘చాలా మంది నీ పరిస్థితి ఎంటి ఎక్కడ పోటీ చేస్తావని నన్ను అడుగుతున్నారు’’ అని అన్నారు.
Andhrapradesh: ముఖ్యమంత్రి జగన్ పర్యటన ఉన్న ప్రాంతాల్లో ప్రజలకు కష్టాలు తప్పడం లేదు. సీఎం పర్యటించే చోట పోలీసుల ఆంక్షలు వర్ణణాతీతం. తీవ్రమైన ట్రాఫిక్ ఆంక్షలతో వాహనదారులు అష్టకష్టాలు ఎదుర్కున్న పరిస్థితులు ఉన్నాయి. తాజాగా అనకాపల్లిలోనూ అదే పరిస్థితి నెలకొంది. జగన్ పర్యటన సందర్భంగా విశాఖ - తుని రూట్లలో పోలీసులు తీవ్ర ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు ట్రాఫిక్‌ను మళ్లించారు.
Andhrapradesh: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (గురువారం) అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్ చేయూత నాలుగో విడత నిధులను సీఎం విడుదల చేయనున్నారు. రేపు ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి అనకాపల్లి జిల్లా కశింకోటకు జగన్ చేరుకోనున్నారు.
Andhrapradesh: మరికొద్దిరోజుల్లో కురుక్షేత్ర యుద్ధం రాబోతుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి అన్నారు. గురువారం జిల్లాలోని రావికమతం మండలం, గంపవాని పాలెం గ్రామంలో ‘‘నిజం గెలవాలి’’ కార్యక్రమంలో భువనేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను తట్టుకోలేక గుండెపోటుతో చనిపోయిన కార్యకర్తల ఇంటికి వచ్చి ఓదార్చారు. అనంతరం భువనమ్మ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అరాచకాలు పెరిగిపోతున్నాయని... టీడీపీ కార్యకర్తలను వేధిస్తున్నారని మండిపడ్డారు.
Andhrapradesh: అనకాపల్లి జిల్లాలో ఇసుక, బెల్ట్ షాపుల నిర్వాహకులు బరితెగుంపులకు పాల్పడ్డారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా ఇసుక, అనధికార బెల్ట్ షాపుల వేలంపాటపై దండోరా వేయించారు. ఈ దండోరా దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
అనకాపల్లి జిల్లా: కె.కోటపాడు మండలం, కె.సంతపాలంలో ప్రభుత్వ భూమిని స్థానిక వైసీపీ చోటా నేతలు కబ్జా చేశారు. కోట్ల రూపాయల విలువచేసే 60 సెంట్ల గ్రామ కంటాన్ని కబ్జా చేసి కంచి వేశారు.
Janasena Leader Nagababu: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జనసేన నేతలు సైతం దూకుడు పెంచుతున్నారు. ముఖ్యంగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు.. అధికార పార్టీ నేతలపై ఫైర్ అవుతున్నారు. తాజాగా అనకాపల్లిలో పర్యటించిన నాగబాబు.. స్థానిక మంత్రిపై సంచలన ఆరోపణలు చేశారు.
64 రోజుల్లో టీడీపీ- జనసేన ప్రభుత్వం రాబోతుందని, ఈ ఎన్నికలు ఏపీ ప్రజల భవిష్యత్ కోసమని, ఎన్నికల్లో రాష్ట్రం గెలవాలి.. ప్రజలు గెలవాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. రాష్ట్రంలో సైకో పాలన అంతం చేస్తే తప్ప భవిష్యత్ లేదని, సైకో సీఎంను తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని ఆయన అన్నారు.
అనకాపల్లి జిల్లా: పాయకరావుపేట మండలం, పెద్దరామభద్రపురంలో విషాదం నెలకొంది. రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ.. కొట్లాటకు దారితీసింది. ఈ క్రమంలో జరిగిన కొట్లాటలో గంపల నూకరాజు అనే వ్యక్తికి తీవ్రంగా గాయపడ్డాడు.