Pawan Kalyan: ఆ గుడ్డు ఇంకా పొదగలేదా..? వైసీపీ మంత్రిపై పవన్ కళ్యాణ్ సెటైర్లు
ABN , Publish Date - Apr 07 , 2024 | 08:01 PM
ఏపీ సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్(Pawan Kalyan) దూసుకెళ్తున్నారు. అధికార వైసీపీ, సీఎం జగన్‌పై తనదైన శైలిలో తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఆదివారం నాడు అనకాపల్లి జిల్లాలోని నెహ్రూ చౌక్ జంక్షన్‌లో ‘వారాహి విజయభేరి’ భారీ బహిరంగ సభలో పవన్ కల్యాణ్ ప్రసంగించారు. మంత్రి గుడివాడ అమర్నాథ్(Gudivada Amarnath)పై సెటైర్లు గుప్పించారు.
అనకాపల్లి జిల్లా: ఏపీ సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ (Pawan Kalyan) దూసుకెళ్తున్నారు. అధికార వైసీపీ, సీఎం జగన్‌పై తనదైన శైలిలో తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఆదివారం నాడు అనకాపల్లి జిల్లాలోని నెహ్రూ చౌక్ జంక్షన్‌లో ‘వారాహి విజయభేరి’ భారీ బహిరంగ సభలో పవన్ కల్యాణ్ ప్రసంగించారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ (Gudivada Amarnath)పై సెటైర్లు గుప్పించారు.
YS Sharmila: ఏపీలో ఎక్కడ చూసిన హత్యలు, దోపిడీలే.. సీఎం జగన్‌పై షర్మిల ఫైర్
‘‘అనకాపల్లి బెల్లం అని గతంలో వినేవాళ్లం... కానీ ఇప్పుడు అనకాపల్లి కోడిగుడ్డును వింటున్నాం. కోడిగుడ్డు పెట్టింది... గుడ్డు పొదుగుతోందని వైసీపీ నేతలు కబుర్లు చెబుతున్నారు. వైసీపీ కోడి ఇక డిప్యూటీ సీఎంను, మంత్రిని, విప్‌ను ఇచ్చినా అనకాపల్లిలో ఒక కిలో మీటర్ రోడ్డు కూడా వేయలేక పోయారు’’ అని ఎద్దేవా చేశారు. మంత్రి గుడివాడ అమర్నాథ్‌ను ఉద్దేశించి కోడిగుడ్డు మంత్రి అని పవన్ మాట్లాడినప్పుడలా యువకులు కేరింతలు కొట్టారు. పవన్ సభకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. ఈ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని.. .కూటమిని గెలిపించాలని పవన్‌కళ్యాణ్ కోరారు.
AP Politics: బస్సు యాత్రలో జగన్‌కు ఝలక్.. ఎమ్మెల్యేల ట్విస్ట్ మామూలుగా లేదు..!
ఈ ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటు చీల్చకూడదనడానికి కారణం యువత మహిళలు, పిల్లలేనని అన్నారు. మీ భవిష్యత్ కోసమే దశాబ్దం కాలం పాటు జనసేన పార్టీలో ఒక ఎమ్మెల్యే లేకపోయినా పార్టీని నడిపానని అన్నారు. అమ్మఒడి పథకంలో కోతలు విధించారని మండిపడ్డారు. ఆఖరి ఏడాదిలో అమ్మఒడిని ఇవ్వకుండా తల్లులకు అన్యాయం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. మధ్యపాన నిషేధం చేస్తామని చెప్పి నాన్న గొంతులు తడుపుతున్న సారా వ్యాపారి జగన్ అని ఎద్దేవా చేశారు.
ఇసుక, ల్యాండ్లు దోచే స్కాంలను జగన్ మొదలెట్టారని మండిపడ్డారు. అనకాపల్లి స్థానం జనసేనది అయినా పొత్తులో భాగంగా బీజేపీ అభ్యర్థన మేరకు ఇచ్చానని చెప్పారు. ఇక్కడ నుంచి బరిలోకి దిగుతున్న సీఎం రమేష్‌ను ఈ ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. జనసేన నుంచి కొణతాల రామకృష్ణ, నాదెండ్ల లాంటి బలమైన నేతలు అసెంబ్లీలో ఉండాలని వారిని గెలిపించాలని పవన్ కళ్యాణ్ కోరారు.
ఇవి కూడా చదవండి
TDP: పామర్రు, ఉయ్యూరులో చంద్రబాబు రోడ్ షో, బహిరంగ సభలు
AP Election 2024: చంద్రబాబుపై సీఎం జగన్ వ్యాఖ్యలు.. ఎన్నికల సంఘం సీరియస్
BJP: ఏపీని డ్రగ్స్, గంజాయి రాష్ట్రంగా మార్చిన జగన్ ప్రభుత్వం: సాధినేని యామిని
మరిన్ని ఏపీ వార్తల కోసం...