AP News: అక్రమంగా నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయం.. అడ్డుకున్న ఎన్డీఏ నేతలు
ABN , Publish Date - Mar 25 , 2024 | 09:47 PM
జిల్లాలోని మండలం కేఎన్ఆర్ పేటలో నిర్మిస్తున్న జిల్లా వైసీపీ కార్యాలయం వద్ద జనసేన , టీడీపీ , బీజేపీ నాయకులు నిరసన తెలిపారు. సర్వే నంబర్ 75- 1 నంబర్లో వైసీపీ నాయకులు అక్రమంగా వైసీపీ జిల్లా కార్యాలయాన్ని నిర్మిస్తున్నా రని తేలియడంతో కూటమి నేతలు ఉమ్మడిగా వెళ్లి అడ్డుకున్నారు.
అనకాపల్లి జిల్లా: జిల్లాలోని మండలం కేఎన్ఆర్ పేటలో నిర్మిస్తున్న జిల్లా వైసీపీ కార్యాలయం వద్ద జనసేన , టీడీపీ , బీజేపీ నాయకులు నిరసన తెలిపారు. సర్వే నంబర్ 75- 1 నంబర్లో వైసీపీ నాయకులు అక్రమంగా వైసీపీ జిల్లా కార్యాలయాన్ని నిర్మిస్తున్నా రని తేలియడంతో కూటమి నేతలు ఉమ్మడిగా వెళ్లి అడ్డుకున్నారు. తెలుగుదేశం హయాంలో ఈ సర్వే నెంబర్‌లోని 75 సెంట్ల విస్తీర్ణంలో కాపు సామాజిక భవనాన్ని నిర్మించడానికి కేటాయిస్తే, ఇప్పుడు ఆ స్థలంలో వైసీపీ కార్యాలయాన్ని నిర్మించడం అన్యాయం అంటూ అగ్రహం వ్యక్తం చేశారు.
అనకాపల్లి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ నేతృత్వంలో వివాదాస్పద స్థలాన్ని కూటమి నేతలు సందర్శించారు. వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అక్రమంగా నిర్మిస్తున్న ఆపార్టీ కార్యాలయ భవనాన్ని కాపు సామాజిక వర్గ భవనంగా మార్చాలని డిమాండ్ చేశారు. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చాక ఇక్కడ కాపు సామాజిక భవనాన్ని అన్ని హంగులతో నిర్మిస్తామని ప్రకటించారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి