CM Jagan: చంద్రబాబు, పవన్ పేర్లు చెబితే ఏం గుర్తొస్తుందో తెలుసా?... జగన్ అనుచిత వ్యాఖ్యలు
ABN , Publish Date - Mar 07 , 2024 | 03:30 PM
Andhrapradesh: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేశారు. అనకాపల్లిలో నిర్వహించి చూయూత బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ... చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు వీరిద్దరి పేర్లు చెబితే ఏం గుర్తుకొస్తుంది అంటూ ప్రశ్నించారు.
అనకాపల్లి, మార్చి 7: టీడీపీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu), జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై (Janasena Chief Pawan Kalyan) ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి (CM Jaganmohan Reddy) మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేశారు. అనకాపల్లిలో నిర్వహించి చూయూత బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ... చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు వీరిద్దరి పేర్లు చెబితే ఏం గుర్తుకొస్తుంది అంటూ ప్రశ్నించారు. ‘‘చంద్రబాబు పేరు చెబితే ఆయన మోసాలు.. పవన్ కల్యాణ్ పేరు చెబితే వివాహ వ్యవస్థకే కళంకం. కార్లను మార్చినట్టు భార్యలను మార్చుతారు. 2014లో వీరిద్దరి మేనిఫెస్టోలో ఏం చెప్పారు. 2014లో పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తామని వాగ్దానం చేశారు. ఆడబిడ్డ పుట్టిన వెంటనే రూ.25వేలు బ్యాంక్ డిపాజిట్ చేస్తామన్నారు. దీనికి మహాలక్ష్మి అని అమ్మవారి పేరు కూడా పెట్టారు. కానీ, వారు ఇచ్చిన హామీలను మాత్రం నెరవేర్చలేదు. ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ కూడా నియమించలేదు. వచ్చే ఎన్నికల్లో కేజీ బంగారం, బెంజ్ కారు ఇస్తామని మోసం చేస్తారు. నేను మీకు మంచి చేశానని నమ్మితే నాకు ఓటు వేయ్యండి. ప్రతిపక్షాలకు ఓటు వేస్తే పులిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నట్లే’’ అంటూ జగన్ దుయ్యబట్టారు.
AP Politics: 10 ఏళ్లు గొర్రెలు అయ్యాం.. ఇక సింహాల్లా పోరాడాల్సిందే..
అక్క చెల్లెమ్మల ఆర్థిక సాధికారతే లక్ష్యంగా ముందడుగు...
జగన్ ఇంకా మాట్లాడుతూ.. మహిళా దినోత్సవం ముందురోజు అక్క చెల్లెమ్మలకు ఆర్థిక సాయం చేయడం సంతోషంగా ఉందన్నారు. 58 నెలల పరిపాలనలో అక్క చెల్లెమ్మల ఆర్థిక సాధికారతే లక్ష్యంగా ముందుడుగు వేశామన్నారు. అక్కచెల్లెమ్మల సాధికారితకు దేశంలో మరే రాష్ట్రం చేయని విధంగా చేయూత అందించామని తెలిపారు. వైఎస్సార్ చేయూత కార్యక్రమంతో ప్రతీ మహిళకు ఆర్థిక స్వావలంబన చేకూరిందన్నారు. వైఎస్సాఆర్ చేయూత వంటి పథకాలను గత ప్రభుత్వం ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. నామినేటెడ్ పోస్టుల్లోనూ మహిళా రిజర్వేషన్లు కల్పించామన్నారు. మహిళల రక్షణ కోసం దిశా యాప్, దిశా పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేశామన్నారు. కోటి 30 లక్షల మంది మహిళల ఫోన్లలో దిశ యాప్ ఉందని.. మహిళా సాధికారత లక్ష్యంగా అడుగులు వేశామని చెప్పారు.
Gudivada Amarnath: ఈ ఎన్నికల్లో మంత్రి గుడివాడ పోటీ చేయనట్లేనా?...
వైఎస్సార్ ఆసరా ద్వారా పొదుపు సంఘాలకు ఊపిరి పోశామన్నారు. 99.83 శాతం రుణాల రికవరీతో దేశంలోనే పొదుపు సంఘాలు నెంబర్ వన్‌గా ఉన్నాయన్నారు. చేయూత ద్వారా అక్కచెల్లెమ్మలకు రూ.75వేలు ఇస్తున్నామని తెలిపారు. 31 లక్షల ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇచ్చామని చెప్పారు. గత ప్రభుత్వంలో ఇలాంటి మంచి పనులు జరిగాయా?... ఎక్కడా లంచాలు లేవన్నారు. గత ప్రభుత్వం అక్క చెల్లెమ్మల కోసం ఏరోజు ఆలోచించలేదని విమర్శించారు. అక్క చెల్లెమ్మలకు చేయూతనిచ్చి చేయి పట్టుకుని నడపిస్తున్నామన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చుకుంటూ ఆర్థిక సాయం అందించామన్నారు. అమ్మఒడి పథకంతో 53లక్షల మంది తల్లులకు అండగా నిలిచిన ప్రభుత్వం మనది అని చెప్పుకొచ్చారు. పిల్లల చదువుల కోసం ఈ స్థాయిలో అండగా నిలిచిన ప్రభుత్వం మరెక్కడా లేదన్నారు. గత ప్రభుత్వం అక్కచెల్లెమ్మలకు ఇలాంటి మేలు చేసిన చరిత్రే లేదని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...