Share News

AP News: అయ్యా న్యాయం చేయండి.. సీఎం జగన్ సభలో దళిత మహిళ నిరసన

ABN , Publish Date - Mar 07 , 2024 | 02:57 PM

Andhrapradesh: జిల్లాలోని జరిగిన చేయూత బహిరంగ సభలో ఓ దళిత మహిళ నిరసనకు దిగింది. తన కొడుకుని హత్య చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ సీఎం జగన్ పర్యటనలో బంధువులతో కలిసి దళిత మహిళ నిరసన తెలిపింది. హత్యకు గురైన సోమాదుల రవితేజ ఫొటోతో నిరసన చేపట్టారు.

AP News: అయ్యా న్యాయం చేయండి.. సీఎం జగన్ సభలో దళిత మహిళ నిరసన

అనకాపల్లి, మార్చి 7: జిల్లాలోని జరిగిన చేయూత బహిరంగ సభలో ఓ దళిత మహిళ నిరసనకు దిగింది. తన కొడుకుని హత్య చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ సీఎం జగన్ (CM Jagan) పర్యటనలో బంధువులతో కలిసి దళిత మహిళ నిరసన తెలిపింది. హత్యకు గురైన సోమాదుల రవితేజ ఫొటోతో నిరసన చేపట్టారు. గత ఏడాది ఫిబ్రవరి 24న తన కొడుకు సోమాదుల రవితేజను హతమార్చారని దళిత మహిళ సోమాదుల కృప ఆవేదన వ్యక్తం చేశారు. హత్య కేసును రోడ్డు ప్రమాదంగా పోలీసులు చిత్రీకరించారని ఆరోపించారు. తన కొడుకు విషయంలో న్యాయం చేయమని అడిగితే పంచాయతీ పారిశుద్ధ్య కార్మికురాలైన తనను విధుల నుంచి అక్రమంగా తొలగించారన్నారు. న్యాయం చేయమని పోలీసులు, పంచాయితీ అధికారులకు మొరపెట్టుకున్నప్పటికీ ప్రయోజనం లేకపోయిందని కృప, ఆమె బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అయితే దీనిపై స్పందించిన ఇన్చార్జి ఆర్డీవో నర్సింగరావు... సీఎం జగన్‌కు చెప్పి న్యాయం చేస్తామంటూ కృప, ఆమె బంధువులను సభా ప్రాంగణం సమీపం నుంచి తీసుకెళ్లిపోయారు.

ఇవి కూడా చదవండి....

Gudivada Amarnath: ఈ ఎన్నికల్లో మంత్రి గుడివాడ పోటీ చేయనట్లేనా?...

AP Politics: 10 ఏళ్లు గొర్రెలు అయ్యాం.. ఇక సింహాల్లా పోరాడాల్సిందే..


మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 07 , 2024 | 02:57 PM