Home » Anantapur urban
రానున్న దసరా పండుగ లోగా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 2023 ఖరీఫ్, రబీ ఇన్సూరెన్స ప్రకటించా లని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. 2023 ఖరీఫ్, రబీ ఇన్సూరెన్స ప్రకటించాలని, కౌలురైతులకు గుర్తింపు కార్డులి వ్వాలనే పలు డిమాండ్ల సాధన కోసం ఏపీ రైతుసంఘం ఆధ్వర్యంలో రైతుల తో కలిసి బుధవారం స్థానిక క్లాక్‌టవర్ నుంచి కలెక్టరేట్ వరకు నిరసన ర్యా లీ నిర్వహించారు.
నగరంలోని గిల్డాఫ్ సర్వీస్ స్కూల్ పక్కనున్న ఎస్సీ, బీసీ బాలికల వసతిగృహాల గేటు ప్రాంతం వాహనాల పార్కింగ్‌కు అడ్డాగా మారింది. సమీపంలో ఆస్ప త్రులు, కాంపౌండ్‌కు ఆనుకొని టీస్టాల్ ఉండటంతో అక్కడికొచ్చే వారు తమ వాహనాలను తీసుకొచ్చి హాస్టల్ గేటు ఎదుట నిలిపి వె ళ్తున్నారు. దీంతో హాస్టల్లోకి వెళ్లేందుకు... బయటికి వచ్చేందుకు విద్యా ర్థినులు ఇబ్బందులు పడుతున్నారు.
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో జరిగిన అవినీతి లెక్కలు బయటకు తీస్తామని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంక టేశ్వరప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక ఎర్రనేల కొట్టాల, మారుతీనగర్‌లో బుధ వారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యేతో పాటు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్ హాజరయ్యారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు.
విద్యార్థులను దేశసేవలో భాగ స్వామ్యం చేయడమే జాతీయ సేవా పథకం(ఎనఎస్‌ఎస్) ఏర్పాటు లక్ష్యమని సెంట్రల్ యూనివర్సీటీ వీసీ ప్రొఫెసర్ ఎస్ఏ కోరి పేర్కొన్నారు. ఎనఎస్‌ఎస్ డేను పురష్కరించుకుని జిల్లాలోని పలు విద్యాసంస్థల్లో మంగళ వారం వివిధ కార్యక్రమాలు నిర్వహించారు.
నగరంలోని అరవింద నగర్లో ఉన్న బీసీ బాలికల వసతి గృహాన్ని ఆదివారం రాత్రి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడి విద్యార్థులతో మాట్లాడారు. పేద పిల్ల లు చదువుకునే వసతి గృహాల్లో భోజనం, ఇతర సదుపాయలు సక్రమంగా ఉండేలా చూడాలని స్బిబ్బందిని ఆదేశించారు.
ఉన్నోళ్లకే పరిమితమైన టౌన బ్యాంకును పేదలకు విరివిగా రుణాలు అందిస్తూ అర్బనబ్యాంకుగా రూపాంతరం సాధించామని బ్యాంకు చైర్మన జేఎల్ మురళీధర్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక సుభా్షరోడ్డులోని శ్రీకృష్ణదేవరాయభవనలో అర్బన బ్యాంకు 108వ మహాజనసభ నిర్వహించారు.
దులీప్ ట్రోఫీ క్రికెట్ పోటీల్లో మూడో రోజు ఇండియా-డి ఆటగాడు రికీ భుయ్ 90 పరుగులు సాధించి.. సెంచరీకి చేరువయ్యాడు. బి జట్టు ఆటగాడు వాషింగ్టన సుందర్ 87 పరులతో రాణించాడు.
అడవి జంతువుల దాడితో పంటలు నష్టపోతున్న అన్నదాతలను ఆదుకోవాలని జడ్పీ చైర్‌పర్సన బోయ గిరిజ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జడ్పీలోని సమావేశ మందిరంలో చైర్‌పర్సన గిరిజ అధ్యక్షతన, సీఈఓ ఓబులమ్మ ఆధ్వర్యంలో ఏడు స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహించారు.
స్టార్ బ్యాట్స్‌మన సూర్యకుమార్ యాదవ్ బ్యాట్‌తో రెచ్చిపోతే చూడాలని ఆశించిన అనంత క్రీడాభిమానులకు నిరాశే ఎదురైంది. కేవలం ఐదు పరుగులకే ‘స్కై’ పెవిలియనకు చేరింది. సంజు శ్యాంసన, అభిమన్యు ఈశ్వరన సెంచరీలతో అలరించారు.
సమాజంలోని స్వార్థ రాజకీయాలు, ఆర్థిక అసమానతలు, శ్రమదోపిడీ, కార్పొరేట్ సంస్థల దోపిడీని రూపుమాపేందుకు నిర్విరామ పోరాటం చేసిన యోధుడు సీతారాం ఏచూరి అని ప్రజాప్రతినిధులు, రాజకీయ, ప్రజా సంఘాల నాయకులు కొనియాడారు.