Home » Ananthapuram
కళ్యాణదుర్గం పట్టణంలోని ప్రధాన కూడళ్లలో భారీగా పోలీసులు మోహరించారు.
వైసీపీ పాలనలో రాష్ర్టాభివృద్ధి శూన్యమని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి విమర్శించారు. మండలకేంద్రంలో ఆదివారం స్థానిక తెలుగుయువత నాయకులు మిషన రాయలసీమపై ప్రచారం నిర్వహించారు.
అనంతపురం జిల్లా: కంబదూరులో మద్యం మత్తులో అల్లరి చేష్టలకు దిగిన నలుగురిపై చర్యలు తీసుకోనున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతపురం జిల్లా, కంబదూరు మండల కేంద్రంలోని పీర్ల గుడి వద్ద నిన్న రాత్రి మద్యం మత్తులో...
అనంతపురం జిల్లా: కంబదూరు మండల కేంద్రంలో మొహరం పండుగ సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పాత కక్షలు నేపథ్యంలో పీర్ల గుడి వద్ద గొడవ మొదలైంది. ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకుంటూ కర్రలతో, కొడవలితో దాడులు చేసుకున్నారు.
తాడిపత్రి మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి నిరసన కొనసాగిస్తున్నారు.
అనంతపురం జిల్లా పామిడి సమీపంలోని పెన్నా నదిలో ఓ వింత చేతి బోరు అందరికీ దర్శనమిస్తోంది. ఈ చేతి బోరు నుంచి నీళ్లు కావాలంటే వెంట నిచ్చెన తీసుకురావాల్సిందే. దీంతో ఈ బోరు అందరికీ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. అసలు పెన్నా నదిలో ఈ చేతి బోరు ఎందుకు ఉందని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఆర్యవైశ్యుల ఆరాధ్యదైవమైన వాసవీమాత శాకాంబరిగా భక్తులకు దర్శనమిచ్చారు. పట్టణ పరిధిలోని డీబీ కాలనీలో నూతనంగా నిర్మించిన ఆష్టలక్ష్మీ ఆలయ ప్రాంగణంలో వెల సిన వాసవాంబను శుక్రవారం శాకాంబరిగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు.
తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గత కొద్దిరోజులుగా విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే.
పింఛన ఇచ్చి ఆదుకోండి మహాప్రభో... అంటూ మండలంలోని ముత్తేపల్లికి చెందిన కిష్టప్ప అనే దివ్యాంగుడు సబ్కలెక్టర్ కార్తీక్కు విన్నవించారు.
తాడిపత్రి పట్టణ సీఐ ఆనందరావు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. రాజకీయ ఒత్తిళ్ల లేక కుటుంబ కుటుంబ సమస్యలే ఆత్మహత్యకు కారణమా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తాడిపత్రికి చేరుకుని ఆనందరావు కుటుంబ సభ్యులతో మాట్లాడారు.