JC Prabhakar: అది లేదనే దిగులుతోనే నువ్వు, మీ చిన్నాన్న పోతారు.. ధర్మవరం ఎమ్మెల్యేపై జేసీ ఫైర్

ABN , First Publish Date - 2023-07-10T10:53:59+05:30 IST

తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గత కొద్దిరోజులుగా విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే.

JC Prabhakar: అది లేదనే దిగులుతోనే నువ్వు, మీ చిన్నాన్న పోతారు.. ధర్మవరం ఎమ్మెల్యేపై జేసీ ఫైర్

అనంతపురం: తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి(Ketireddy Peddareddy), ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిపై (Dharmavaram MLA Ketireddy Venkataramireddy) తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy) గత కొద్దిరోజులుగా విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. తాడిపత్రి ఎమ్మెల్యే చీనీ తోటకు సంబంధించి ఆరోపణలు చేసిన జేసీ ఇప్పుడు తాజాగా ధర్మవరం ఎమ్మెల్యేపై కూడా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘‘ఎమ్మెల్యే పదవి లేకుంటే అది లేదనే దిగులుతోనే నువ్వు, మీ చిన్నాన్న చనిపోతారు’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. ప్రజలు మిమ్మల్ని చెప్పులతో కొడుతారన్నారు. వాళ్ల మాదిరిగా దోచుకోవడం తనకు చేత కాదన్నారు. ఇంట్లో నాటుసారా అమ్మి బతికేవాళ్లు... కేసులు నమోదు చేశారని మండిపడ్డారు. ‘‘చెప్పుతో కొడుతావా... కొట్టురా చూద్దాం... మీ తాత చనిపోతే పోలేకపోయారు. పోలీస్ లేకుంటే మీ చిన్నాన్న ఒక్క అడుగువేస్తాడా. మీ నాన్నను చంపిన వాళ్ళతో ఎందుకు రాజీ అయ్యారు’’ అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Updated Date - 2023-07-10T10:53:59+05:30 IST