Viral Video: ఈ బోరు నుంచి నీళ్లు కావాలంటే నిచ్చెన వాడాల్సిందే..!!

ABN , First Publish Date - 2023-07-21T19:40:34+05:30 IST

అనంతపురం జిల్లా పామిడి సమీపంలోని పెన్నా నదిలో ఓ వింత చేతి బోరు అందరికీ దర్శనమిస్తోంది. ఈ చేతి బోరు నుంచి నీళ్లు కావాలంటే వెంట నిచ్చెన తీసుకురావాల్సిందే. దీంతో ఈ బోరు అందరికీ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. అసలు పెన్నా నదిలో ఈ చేతి బోరు ఎందుకు ఉందని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Viral Video: ఈ బోరు నుంచి నీళ్లు కావాలంటే నిచ్చెన వాడాల్సిందే..!!

ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా బోరు (Pump) నుంచి నీళ్లు కావాలంటే చేత్తో పంపింగ్ చేయాల్సిందే. గతంలో ప్రతి ఇంట్లో చేతి బోరు ఉండేది. కాలానికి అనుగుణంగా పరిస్థితులు మారడంతో చేతి బోర్ల స్థానంలో ట్యాప్స్ వచ్చాయి. అయితే పబ్లిక్ ప్లేసుల్లో మాత్రం చేతి బోర్లు ఇప్పటికీ కనిపిస్తుంటాయి. కొన్ని చోట్ల బోర్లు లోతైన ప్రదేశాల్లో ఉంటే మరికొన్ని చోట్ల మాత్రం అందనంత ఎత్తులో ఉంటాయి. అలాంటి చోట్ల మనకు మెట్లు కనిపిస్తుంటాయి. కానీ చేతి బోరు వాడాలంటే నిచ్చెన (Ladder) వేసుకోవాల్సిన వింత పరిస్థితిని ఎప్పుడైనా మీరు చూశారా?

bore.jpg

అనంతపురం జిల్లా పామిడి సమీపంలోని పెన్నా నదిలో ఓ వింత చేతి బోరు అందరికీ దర్శనమిస్తోంది. ఈ ఫోటో చూస్తే మీకు అర్ధమైపోయి ఉంటుంది. ఈ చేతి బోరు నుంచి నీళ్లు కావాలంటే వెంట నిచ్చెన తీసుకురావాల్సిందే. దీంతో ఈ బోరు అందరికీ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. అసలు పెన్నా నదిలో ఈ చేతి బోరు ఎందుకు ఉందని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీని పూర్వాపరాలు ఏంటని విచారించగా అసలు విషయం తెలిసింది.

ఇది కూడా చదవండి: AC: ఇంట్లో వాడే ఏసీని కొని అయిదేళ్లకు పైనే అయిందా..? అయితే వెంటనే చేయాల్సిన పనేంటంటే..!

పామిడి పట్టణ ప్రజలు ఎవరైనా చనిపోతే గతంలో ఈ పెన్నా నది ఒడ్డున దహన సంస్కారాలు ముగించుకుని ఈ బోరు వద్దకు వచ్చి స్నానం చేసేవారట. ఇందుకోసమే ఈ బోరును వారు ఏర్పాటు చేసుకున్నారట. అయితే గత ఏడాది కురిసిన భారీ వర్షాల వల్ల పీఏబీఆర్, ఎన్టీఆర్ డ్యాం పూర్తిగా నిండటంతో పెన్నా నదికి నీటిని వదిలారు. ఆ సమయంలో ఈ చేతి బోరు చుట్టూ ఉన్న ఇసుక పూర్తిగా కొట్టుకునిపోవడంతో ప్రస్తుతం బోరు ఇలా అందనంత ఎత్తులో దర్శనమిస్తోంది. ప్రస్తుతం ఈ చేతి బోరు వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుండగా నెటిజన్‌లు ఛమత్కరిస్తూ ఫన్నీ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. బోరు స్తంభం ఎక్కిందని కొందరు.. భూమి మీద ఉండాల్సిన బోరు గాల్లోకి ఎలా వెళ్లిందని మరికొందరు.. నిచ్చెన ఎక్కి నీటిని తెచ్చుకోవాలా అని ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Crow Video: ఈ కాకికి ఉన్న బుద్ధి మనుషులకు లేకుండా పోతోందిగా.. డస్ట్ బిన్ దగ్గర ఈ కాకి చేసిందేంటో చూడండి..!

Updated Date - 2023-07-21T19:40:34+05:30 IST