Share News

Jagan Mohan Reddy: అయినా.. మనిషి మారలేదు!

ABN , Publish Date - Feb 06 , 2025 | 03:44 AM

అంతలోనే... ‘మళ్లీ గెలుస్తాం. 30 ఏళ్లు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా’ అని పాత పాట అందుకున్నారు. బుధవారం తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో విజయవాడ నగర వైసీపీ నేతలతో జగన్‌ సమావేశమయ్యారు.

Jagan Mohan Reddy: అయినా.. మనిషి మారలేదు!
YS Jagan

  • ఊహాలోకంలోనే జగన్‌ విహారం

  • ఎన్నికలు ఇప్పుడొచ్చినా గెలుస్తాం!

  • 30 ఏళ్లు నేనే ముఖ్యమంత్రిని

  • ‘జగన్‌ 2.0’లో కార్యకర్తలకు ప్రాధాన్యం

  • పార్టీ నేతల సమావేశంలో వ్యాఖ్యలు

అమరావతి, ఫిబ్రవరి 5(ఆంధ్రజ్యోతి): ‘‘ముప్పై ఏళ్లు నేనే ముఖ్యమంత్రిని’’... అధికారంలో ఉండగా జగన్‌ తరచూ చెప్పిన మాట ఇది! ఇప్పుడు... పవర్‌ పోయి ఎనిమిది నెలలైంది. అంతలోనే... ‘మళ్లీ గెలుస్తాం. 30 ఏళ్లు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా’ అని పాత పాట అందుకున్నారు. బుధవారం తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో విజయవాడ నగర వైసీపీ నేతలతో జగన్‌ సమావేశమయ్యారు. ఈ భేటీలో కలలకు కళ్లెం లేదు, ఊహలకు హద్దే లేదన్న రీతిలో మాట్లాడారు. ‘‘జమిలి ఎన్నికలు ఇప్పుడు జరిగినా విజయం నాదే. ఐదేళ్ల నా పాలనతో తొమ్మిది నెలల టీడీపీ పాలనను జనం బేరీజు వేసుకుంటున్నారు’’ అన్నారు. తన 2.0 పాలన కార్యకర్తల కేంద్రంగానే ఉంటుందని చెప్పారు. ‘‘నా మొదటి విడత పాలన అంతా ప్రజలపైనా, వారికి అందించాల్సిన సంక్షేమం పైనే దృష్టి పెట్టాను. ఈసారి అలా జరగదు. పూర్తిగా కార్యకర్తల కోసమే 2.0 పాలన ఉంటుంది’’ అని జగన్‌ అన్నారు.


ఇదేం గోల...

ఎన్నికలకు ముందు ఆయన ఇదే ధోరణిలో వై నాట్‌ 175 అంటూ బీరాలు పలికారు. ప్రతిపక్ష కూటమికి ఒక్క స్థానం కూడా రాదని సభలు, ప్రచార కార్యక్రమాల్లో ఆవేశపడ్డారు. సరే.. ఎన్నికల సమయంలో ఇలాంటి ధోరణిని ప్రదర్శించారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ, మాజీగా.. మారిన తర్వాతా అదే రాగం వినిపించడంతో.. సొంత పార్టీ శిబిరంలోని వారే చిరాకు పడిపోతున్నారు. ‘‘బాస్‌ చెప్పాడుగా... ఇక 30 ఏళ్లు జగనే సీఎం’’ అంటూ మాట్లాడుకోవడం మాములై పోయింది. గతనెలలో లండన్‌ పర్యటనకు వెళ్లిన జగన్‌.. సోమవారం తాడేపల్లి నివాసానికి చేరుకున్నారు. మరునాడు తనను కలసిన మాజీ మంత్రు లు, మాజీ ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ.. పోలవరంపై సొంత డబ్బా వినిపించారు. తన హయాంలో పోలవరం సాగునీటి ప్రాజెక్టు ప్రగతి పరుగులు తీసిందని.. చెప్పుకొచ్చారు. పోలవరంలో పనులు తమకు తెలియకుండా ఎక్కడ పరుగులు పెట్టాయో తెలియక అక్కడ ఉన్న నేతల్లో కొందరు తెల్లముఖం వేశారని సమాచారం.

ఆత్మవిమర్శ ఏదీ?

జగన్‌ ఓటమికి కారణాలు ఏమిటనేది ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు బయటపెట్టారు. ఆ రోజుల్లో ఫోన్లలో ధైర్యంగా మాట్లాడుకునేవారు కాదు. ‘చెవులు’ వింటాయని చాలావరకు వాట్సాప్‌ కాల్‌ చేసుకుని మాట్లాడుకునేవారు. రాష్ట్రంలో భావ ప్రకటన స్వేచ్ఛకు గత ప్రభుత్వం పట్టించిన గతి ఇది. వీటిపై ఆత్మవిమర్శ చేసుకునేందుకు జగన్‌ ప్రయత్నించడం లేదు. పైగా, జనం తననే సీఎంగా కోరుకుంటున్నారన్న భ్రమల్లో ఆయన ఉన్నారని ఆ పార్టీ నేతలే ప్రైవేటు సంభాషణల్లో వ్యాఖ్యానిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Nara Lokesh : జగన్‌ సెక్యూరిటీపై లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు

Pawan Kalyan: విశాంత్రిలో పవన్ కళ్యాణ్.. అసలు విషయం ఇదే..

Updated Date - Feb 06 , 2025 | 07:49 AM