Share News

AP Govt: జగన్ హయాంలో ఆర్థిక వ్యవహారాలను బహిర్గతం చేసిన ‘నివేదిక’

ABN , Publish Date - Nov 13 , 2024 | 07:14 PM

వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆర్థిక వ్యవహారాలను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తన నివేదికను బహిర్గతం చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కాగ్ నివేదికలను ఏపీ ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం బుధవారం శాసనసభ ముందు ఉంచింది. ఈ ఆర్ధిక సంవత్సరంలో ప్రతీ రూపాయిలో 52 పైసలు పన్ను వసూళ్ల ద్వారా వచ్చాయని పేర్కొంది.

AP Govt: జగన్ హయాంలో ఆర్థిక వ్యవహారాలను బహిర్గతం చేసిన ‘నివేదిక’

అమరావతి, నవంబర్ 13: చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను సోమవారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్‌పై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ బుధవారం స్పందించి.. విమర్శలు సంధించారు. అలాంటి వేళ వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆర్థిక వ్యవహారాలను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తన నివేదికను బహిర్గతం చేసింది. 2023 24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కాగ్ నివేదికలను ఏపీ ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం శాసనసభ ముందు ఉంచింది. ఈ ఆర్ధిక సంవత్సరంలో ప్రతీ రూపాయిలో 52 పైసలు పన్ను వసూళ్ల ద్వారా వచ్చాయని పేర్కొంది.

Also Read: AP Politics: బడ్జెట్‌పై జగన్ షాకింగ్ కామెంట్స్


ప్రతీ రూపాయిలో 30 పైసలు రుణాల ద్వారా తెచ్చారని వెల్లడించింది. గ్రాంట్స్ ఇన్ ఎయిడ్‌గా 14 పైసలు, పన్నుయేతర ఆదాయం 3 పైసలు, రుణాల రికవరీ ద్వారా ఒక పైసా చొప్పున ఆర్జించారని కాగ్ తన నివేదికలో స్పష్టం చేసింది. ఇక ప్రతీ రూపాయిలో 15 పైసల మేర జీతాలకు వెచ్చించారని పేర్కొంది. డీబీటీలకు 13 పైసలు చొప్పున, వడ్డీలకు 12 పైసల చొప్పున చెల్లించారని వెల్లడించింది. అలాగే స్థానిక సంస్థలకు ప్రతీ రూపాయిలో కేవలం 9 పైసలు మాత్రమే చెల్లించారని చెప్పింది. మూల ధన వ్యయంగా కేవలం 9 పైసలు మాత్రమే ఖర్చు చేశారని వివరించింది. ప్రధాన పనులకు వెచ్చించిందీ కూడా 9 పైసలుగా ఉందని కాగ్ విశదీకరించింది. చెల్లించిన అప్పులు.. ప్రతీ రూపాయిలో 7 పైసలు మాత్రమే ఉందని తెలిపింది.

Also Read: వైసీపీ సోషల్ మీడియా సైకోలపై వైఎస్ సునీత ఫిర్యాదు


ఇక 2023-24 ఆర్ధిక సంవత్సరంలో రాష్ట్రంలో సొంత పన్ను ఆదాయం రూ. 922 కోట్లుగా ఉందని వెల్లడించింది. బడ్జెట్‌లో అనుమతించిన వ్యయం కంటే ఇంధన శాఖకు రూ. 217 కోట్ల మేర అదనంగా వ్యయం చేశారని కాగ్ తెలిపింది. అదే విధంగా శాసనసభ అనుమతి లేకుండానే విద్యా శాఖలోనూ రూ. 249 కోట్లు అదనంగా వ్యయికరించారని చెప్పింది.

Also Read: గాడిద పాలు తాగితే ఇన్ని లాభాలున్నాయా..?


2023 ఏప్రిల్ 1వ తేదీన రిజర్వు బ్యాంకు వద్ద రాష్ట్ర నగదు నిల్వ రూ.-19 కోట్లుగా ఉంటే.. అది 2024 మార్చి 31 తేదీ నాటికి రూ.-33 కోట్లుగా ఉందని పేర్కొంది. ట్రెజరీ బిల్లుల ద్వారా కేవలం 14 రోజుల వ్యవధిలో రూ.20,204 కోట్లు పెట్టినట్టుగా.. ప్రభుత్వం వాటిని రూ.21,140 కోట్లతో రీడిస్కౌంట్ చేసిందని చెప్పింది. అయితే ఏడాది చివరి నాటికి పెట్టుబడుల ఖాతాలో అసలు నగదు నిల్వే లేదని స్పష్టం చేసింది.

Also Read: karthika pournami: కార్తీక పౌర్ణమి రోజు ఇలా చేయండి చాలు..


2023-24లో ప్రభుత్వ అప్పులు రూ. 4,86,151 కోట్లుగా ఉన్నట్టు తెలిపింది. ఇది రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 34 శాతంగా ఉన్నట్లు వెల్లడించింది. ఆ ఆర్ధిక సంవత్సరంలో రూ, 2,23,004 కోట్ల మేర ప్రభుత్వ గ్యారెంటీలు ఇచ్చినట్టు చెప్పింది. ఇక ఏడాది మొత్తంలో రూ.69,626 కోట్ల కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి పీడీ ఖాతాలకు బదిలీ అయినట్లు కాగ్ పేర్కొంది. 2023-24 ఆర్ధిక సంవత్సరంలో ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్‌గా 32,903 కోట్లుగా కాగ్ తెలిపింది. ఈ మొత్తంలో రూ.10,037 కోట్లు వోచర్ల స్క్రూటినీ ద్వారా బయటపడిందని కాగ్ వివరించింది.

Also Read: Hyderabad: హోటళ్లలో అధికారులు తనిఖీలు.. విస్తుపోయే నిజాలు


అలాగే విద్యుత్ సంస్థలకు సంబంధించిన నాన్ రికవరీ కాస్ట్‌గా రూ.14,014 కోట్లను ప్రభుత్వ లెక్కల్లో చూపించారని పేర్కొంది. 2022-23తో పోలిస్తే 2023-24లో డీబీటీ ద్వారా చెల్లించిన సొమ్ము 27.83 శాతం మేర తగ్గిందని కాగ్ స్పష్టం చేసింది. ఇక 2022-23లో ఈ మొత్తం రూ.16,767 కోట్లుగా ఉంటే.. 2023-24లో డీబీటీ ద్వారా చెల్లించిన సొమ్ము రూ.12,101 కోట్లకు తగ్గిందని కాగ్ పేర్కొంది.

For AndhraPradesh News And Telugu News

Updated Date - Nov 13 , 2024 | 07:14 PM