Home » Andhrajyothi
ప్యారిస్ ఒలింపిక్స్‌లో ఈ యువతి కూడా ఒక కీలకపాత్ర పోషించింది. అతిపెద్ద క్రీడా పండగను... అంతే అద్భుతంగా మన కళ్ల ముందుం చిన ఫొటో జర్నలిస్టుల్లో అసోమ్‌కు చెందిన గీతికా తాలుక్దార్ ఒకరు.
‘ప్లాస్టిక్ బొమ్మలు వద్దు.. బట్ట బొమ్మలే ముద్దు..’ అంటున్న ఈ దంపతులు కొత్త ప్రయోగం చేశారు. బొమ్మల తయారీలో ఒక విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టారు. పర్యావరణ హిత బట్ట బొమ్మలను ఉత్పత్తి చేస్తూ.. తమిళనాడులోని నీలగిరి పర్వత ప్రాంత గిరిజనుల జీవితాల్లో కొత్త కాంతిని నింపారు... సుహాస్, సునీత దంపతులు..
శ్రీకృష్ణాష్టమికి ఉట్టి కొట్టే వేడుకలు ఊరూరా జరుగుతాయి. ఇలాంటి ఆటే ఇండోనేషియాలో కూడా కనిపిస్తోంది. అదే ‘పంజత్ పినాంగ్’. ఆ దేశ సంప్రదాయ క్రీడ ఇది. పోక చెట్ల పై భాగాన్ని కొట్టేసి, జెండా పెడతారు, దాని చుట్టూ చక్రంలాంటిది అమర్చుతారు.
భాషతో సంబంధం లేకుండా దక్షిణాదిన తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు దుల్కర్ సల్మాన్. ‘మహానటి’, ‘సీతారామం’ వంటి క్లాసిక్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఈ యువ హీరో ‘లక్కీ భాస్కర్’గా అలరించేందుకు సిద్ధమయ్యాడు.
వర్షాలు కురవకపోతే కప్పలను పూజించడం, వాటికి పెళ్లి చేసి ఊరేగించడం లాంటి ఆచారం గురించి అప్పుడప్పుడు వింటుంటాం... చూస్తుంటాం. కరువు కాటకాలతో సతమతమయ్యే కొన్ని ప్రాంతాల్లో ఈ ఆచారం ఇప్పటికీ ఉంది. అయితే ఏకంగా కప్ప కోసం గుడి కట్టిన సందర్భం మాత్రం కచ్చితంగా విశేషమే.
పచ్చని గుట్టలు, లోయ మలుపులు దాటి డుంబ్రిగుడ మండలం (అల్లూరి సీతారామరాజు జిల్లా) వైపు వెళ్తే పొలంలో నాట్లు వేస్తూ కనిపించాడు 70 ఏళ్లు దాటిన తాంగుల వెంకటరమణ. ‘‘పూర్వం మా తాతముత్తాతలు వీటినే పండించి తిన్నారు. అదే మాకు వారసత్వంగా వచ్చింది.
వ్యాయామం అంటే.. ఉదయాన్నే లేచి చెయ్యాలేమో అనుకుంటారు చాలామంది. కానీ అది కేవలం అపోహ మాత్రమేనని తేల్చి చెప్పేశాయి ఇటీవల కొన్ని అధ్యయనాలు. నిజానికి ఉదయం కన్నా సాయంత్రం పూట (5 నుంచి రాత్రి 8 దాకా) చేసే వ్యాయామాలే చక్కని ప్రయోజనాలు కలిగిస్తాయట. ఆ విశేషాలే ఇవి...
తన ప్రత్యర్థులను వెనక్కి నెట్టేసి చార్లీ దూసుకుపోతున్నాడు. కాలిఫోర్నియాలోని పసిఫికాలో ఏటా వరల్డ్ డాగ్ సర్ఫింగ్ ఛాంపియన్షిప్ పోటీలు జరుగుతాయి. అలలపై సర్ఫింగ్ చేస్తున్న శునకరాజులు ఓ అద్భుతమే.
ప్రియాంక మోహన్... నానీ ‘గ్యాంగ్ లీడర్’తో తెలుగులో సినీ ప్రయాణానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే తమిళంలో స్టార్ హీరోయిన్గా ఎదిగిన ఈ భామ ఇకపై తెలుగుపై దృష్టి సారించింది. ‘సరిపోదా శనివారం’ అంటూ మరోసారి నానీతో జత కడుతోంది. ఈ సందర్భంగా కొన్ని విషయాలను ఇలా పంచుకుంది...
ఆంధ్రజ్యోతి నవ్య పేజీలో మానవీయ కథనాలు రాసి పాఠకులను మెప్పించిన జర్నలిస్టు కె.వెంకటేశ్‌కు మోటూరి హనుమంతరావు ఉత్తమ జర్నలిస్టు అవార్డును ప్రదానం చేశారు.