Home » AP Assembly Budget Sessions
Andhrapradesh: ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. ఏపీ అసెంబ్లీలో ఆందోళన చేస్తున్న టీడీపీ సభ్యులను ఒకరోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.
Andhrapradesh: రెండో రోజు ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యుల నినాదాలతో గందరగోళం నెలకొంది. వాయిదా తీర్మానంపై చర్చకు పట్టుబడుతూ టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్ద నిరసనకు దిగారు. టీడీపీ సభ్యుల నిరసనల మధ్యే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తేలిపే తీర్మానంపై ప్రసంగం మొదలైంది.
Andhrapradesh: టీడీపీ ఎమ్మెల్యేల నినాదాలతో రెండో రోజు ఏపీ అసెంబ్లీ దద్దరిల్లింది. మంగళవారం సభ మొదలవగానే నిత్యావసర వస్తువుల ధరలపై టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. అయితే వాయిదా తీర్మానంపై చర్చ చేపట్టాలని టీడీపీ సభ్యులు ఒత్తిడి తీసుకొచ్చారు. గ్యాస్ ధరలు పెరిగాయని అందువలన చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు.
Andhrapradesh: ఈనెల 8 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. ఈ మేరకు బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. నేడు (సోమవారం) అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారాం నేతృత్వంలో బీఏసీ సమావేశమైంది. నాలుగు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు. బుధవారం (ఫిబ్రవరి 7) అసెంబ్లీలో ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది.
Andhrapradesh: ఏపీ అసెంబ్లీలో ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం ముగిసింది. టీడీపీ సభ్యుల ఆందోళనల మధ్యే గవర్నర్ స్పీచ్ కొనసాగింది. ప్రభుత్వ సంక్షేమ పధకాలను గవర్నర్తో ప్రభుత్వం వల్లెవేయించింది.
Andhrapradesh: ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం జరుగుతుండగానే టీడీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అబద్దాలు వినలేకపోతున్నామంటూ టీడీపీ సభ్యులు సమావేశాల నుంచి బయటకు వచ్చేశారు. ఏపీ అసెంబ్లీలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం మొదలైనప్పటి నుంచి పలు అంశాలపై టీడీపీ సభ్యులు అభ్యంతరం తెలుపుతూనే ఉన్నారు.
Andhrapradesh: ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని టీడీపీ సభ్యులు పదే పదే అడ్డుకోవడంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో పలు అంశాలపై టీడీపీ ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యంతరం తెలుపుతూ.. అనేకసార్లు నినాదాలు చేశారు.
Andhrapradesh: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తున్నారు. అయితే గవర్నర్ ప్రసంగంలో చెప్పిన ఓ అంశంపై టీడీపీ ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. దీంతో సభలో కాసేపు గందరగోళన పరిస్థితి నెలకొంది.
Andhrapradesh: ఏపీ అసెంబ్లీ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ మొదలవగానే ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తున్నారు.
అమరావతి: విరామం అనంతరం తిరిగి ఏపీ శాసనమండలి ప్రారంభమైంది. పలు బిల్లులు టేబుల్ చేస్తున్నట్టు ఛైర్మన్ ప్రకటించారు. దీంతో మళ్లీ టీడీపీ ఎమ్మెల్సీలు నినాదాలు చేశారు. పోడియంపైకి దూసుకువెళ్లి నిరసన తెలిపారు. చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండించాలంటూ ఆందోళన చేశారు.