AP Assembly: హోరెత్తిన టీడీపీ సభ్యుల నినాదాలు... ఏపీ అసెంబ్లీలో ఏం జరుగుతోంది?
ABN , Publish Date - Feb 06 , 2024 | 09:46 AM
Andhrapradesh: టీడీపీ ఎమ్మెల్యేల నినాదాలతో రెండో రోజు ఏపీ అసెంబ్లీ దద్దరిల్లింది. మంగళవారం సభ మొదలవగానే నిత్యావసర వస్తువుల ధరలపై టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. అయితే వాయిదా తీర్మానంపై చర్చ చేపట్టాలని టీడీపీ సభ్యులు ఒత్తిడి తీసుకొచ్చారు. గ్యాస్ ధరలు పెరిగాయని అందువలన చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు.
అమరావతి, ఫిబ్రవరి 6: టీడీపీ ఎమ్మెల్యేల (TDP MLAs) నినాదాలతో రెండో రోజు ఏపీ అసెంబ్లీ (AP Assembly Session) దద్దరిల్లింది. మంగళవారం సభ మొదలవగానే నిత్యావసర వస్తువుల ధరలపై టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం (Speaker Tammineni Seetharam) తిరస్కరించారు. అయితే వాయిదా తీర్మానంపై చర్చ చేపట్టాలని టీడీపీ సభ్యులు ఒత్తిడి తీసుకొచ్చారు. గ్యాస్ ధరలు పెరిగాయని అందువలన చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. టీడీపీ సభ్యుల నినాదాల మధ్యే మంత్రులు బిల్లులను ప్రవేశపెడుతున్నారు. స్పీకర్ పోడియం ఎక్కి మరీ తెలుగుదేశం సభ్యులు నినాదాలు చేశారు. స్పీకర్ చైర్ వద్దకు దూసుకొచ్చిన ఎమ్మెల్యేలు బాదుడే బాదుడు అంటూ నినాదాలతో హోరెత్తించారు. దీంతో అసెంబ్లీలో ఎవరేమి మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. పప్పులు, ఉప్పులు బాదుడే బాదుడు అంటూ ప్రతిపక్ష టీడీపీ సభ్యుల నినాదాలతో అసెంబ్లీలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది.
గంటా రాజీనామా ఆమోదం...
కాగా.. రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవగా.. ముందుగా నిత్యావసర వస్తువుల ధరలపై తెలుగుదేశం వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. అలాగే గంటా శ్రీనివాస రావు రాజీనామాను ఆమోదించినట్టు స్పీకర్ వెల్లడించారు. తర్వాత సభలో సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టారు. ఇటీవల మరణించిన మాజీ ఎమ్మెల్యేలకు సంతాపంగా సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..