AP Assembly: మహాత్మా గాంధీజీ మాటలతో ముగిసిన గవర్నర్ ప్రసంగం
ABN , Publish Date - Feb 05 , 2024 | 12:00 PM
Andhrapradesh: ఏపీ అసెంబ్లీలో ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం ముగిసింది. టీడీపీ సభ్యుల ఆందోళనల మధ్యే గవర్నర్ స్పీచ్ కొనసాగింది. ప్రభుత్వ సంక్షేమ పధకాలను గవర్నర్‌తో ప్రభుత్వం వల్లెవేయించింది.
అమరావతి, ఫిబ్రవరి 5: ఏపీ అసెంబ్లీలో (AP Assembly Session) ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ (AP Governor Abdul Nazeer) ప్రసంగం ముగిసింది. టీడీపీ సభ్యుల ఆందోళనల మధ్యే గవర్నర్ స్పీచ్ కొనసాగింది. ప్రభుత్వ సంక్షేమ పధకాలను గవర్నర్‌తో ప్రభుత్వం వల్లెవేయించింది. ఆంధ్రప్రదేశ్ టూరిజం ప్రాజెక్టులను గవర్నర్ ప్రస్తావించారు. చివరకు జాతిపత మహాత్మాగాంధీ మాటలతో గవర్నర్ తన ప్రసంగాన్ని ముగించారు.
ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం...
విజయవాడలో ప్రపంచంలో ఎత్తైన అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ జరిగిందన్నారు. 18.8 ఎకరాల్లో 206 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని రూ.404.35 కోట్లతో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ విగ్రహం ఏర్పాటు పట్ల సీఎం జగన్, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు తెలిపారు. అల్పాదాయ వర్గాలకు ఆర్థిక లబ్ధి చేకూర్చే నవరత్నాలు కార్యక్రమం అమలు చేశామన్నారు. విద్యార్ధిని, విద్యార్థులకు బైజూస్ కంటెంట్‌తో టాబ్‌లు ఇచ్చామన్నారు. విద్యార్థులను గ్లోబల్ సిటిజన్స్‌గా మార్చే కృషి జరుగుతుందన్నారు. ఇంగ్లీష్ మీడియం వలన విద్యార్థులు అంతర్జాతీయంగా పోటీ పడే పరిస్థితి తెచ్చామని గవర్నర్ వెల్లడించారు.
గవర్నర్ ప్రసంగంలోని అంశాలు ఇవే..
రూ.925 కోట్లు గండికోట ప్రాజెక్టు నిర్వాసితుల కోసం ఖర్చు చేశాం.
77 మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కర్నూలులో తీసుకుంది.
వెలుగొండ ప్రాజెక్టు రెండవ టన్నల్ కొన్ని రోజుల్లోనే పూర్తిచేస్తాం.
కుప్పం నియోజకవర్గానికి కుప్పం బ్రాంబ్ కెనాల్‌ను పూర్తిచేస్తాం.
9 డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టులను వివిధ జిల్లాల్లో కేటాయించాం.
13 జిల్లాలద్వారా పాలన ప్రజలకు వెళ్లింది.
4000 గ్రామల్లో ఇప్పటికే వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూక్కు భూరక్షకింద 100 సంత్సరాల తరువత సర్వే నిర్వహిచాం.
ఏదైనా సంక్షేమ పథకం అర్హులకు అందకపోతే గడపగడపకు మన ప్రభుత్వం ద్వారా వెళ్లి వారికి అందించాం.
బాపూజీ మాటలతో....
చివరగా.. మహాత్మాగాంధీ మాటలతో గవర్నర్ తన స్పీచ్‌కు ముగింపు పలికారు. ‘‘సమాజం యొక్క పురోగతి అత్యంత దుర్భలమైన, బలహీనుల స్ధాయిని బట్టి నిర్ణయించబడాలి. అభవృద్ధి అంచుల్లో నిలబడ్డ వారిని ఇతరుల స్ధాయికి తీసుకురావాల్సి ఉంది’’ అంటూ గవర్నర్ ప్రసంగాన్ని ముగించారు. గవర్నర్ స్పీచ్ అయ్యాక జై జగన్ అంటూ వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభలోనే నినాదాలు చేశారు. గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత సభ రేపటి (మంగళవారం)కి వాయిదా పడింది. కాసేపట్లో బీఏసీ సమావేశం జరుగనుంది. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై బీఏసీలో నిర్ణయం తీసుకోనున్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...