Home » AP Assembly Elections 2024
సీఎం, వైఎస్సార్పీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి (CM JAGAN) మేనమామ, వైసీపీ నేత రవీంద్రనాథ్ రెడ్డి (Ravindranath Reddy) నోరు జారారు. ఆదివారం ఆయన తిరుపతిలోని వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఈ సమయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైసీపీ అని నోరుజారారు.
ఏపీలో ఎన్నికల పోలింగ్ ముగిసి వారం రోజులు కావొస్తుంది. ఫలితాల కోసం మరో 15 రోజులు ఆగాల్సిందే. ఈలోపు గెలుపుపై ఎవరి అంచనాలు వారివి. మరోవైపు పందేం రాయుళ్ల హడావుడి. నియోజకవర్గాలవారీ ఇప్పటికే కోట్లలో పందేలు నడుస్తున్నాయి. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేదానిపై ఇప్పటికే వందల కోట్ల రూపాయిలు పందేలు కట్టినట్లు తెలుస్తోంది. పోలింగ్ రోజు వరకు వైసీపీకి చెందిన నేతలు పందేలు కట్టేందుకు భారీగా ముందుకు రాగా.. ప్రస్తుతం సర్వే సంస్థల నుంచి వచ్చిన సమాచారం, గ్రామాల వారీ క్యాడర్ అందిస్తున్న వివరాలతో వైసీపీ నేతలు పందేలు కట్టడంలో కొంచెం వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.
అవును.. మీరు వింటున్నది నిజమే మాజీ మంత్రి, గుడివాడ వైసీపీ అభ్యర్థి కొడాలి నాని (Kodali Nani) పోలింగ్ తర్వాత తీవ్ర ఆవేదన చెందుతున్నారట. ఎందుకంటే.. ఎన్నికల్లో (AP Elections) ఓటర్లకు పంచాల్సిన డబ్బులు కొందరు నాని మనుషులు కాజేశారన్నది.. ఇప్పుడు నియోజకవర్గంలో నడుస్తున్న చర్చ. సొంత పార్టీ నేతలే ఇలా చేయడంతో కొడాలి ఆవేదన వ్యక్తం చేస్తున్నారట..
సార్వత్రిక ఎన్నికల తరువాత అల్లర్లు చెలరేగడం, మరికొన్ని రోజుల్లో ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు.
ముఖ్యమంత్రి జగన్ తన కుటుంబ సభ్యులతో కలసి బయలుదేరిన ప్రత్యేక విమానం నాలుగు గంటలు ఆలస్యంగా లండన్ విమానాశ్రయంలో దిగింది..
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల (AP Elections) ముందు.. ఆ తర్వాత జరిగిన అల్లర్లు ఇప్పుడిప్పుడే కొలిక్కి వస్తున్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 144 సెక్షన్ అమలు చేయడంతో పరిస్థితులు చక్కబడుతున్నాయి. మరోవైపు.. ఈ అల్లర్ల ఘటనపై విచారణ చేసేందుకు తాడిపత్రికి సిట్ అధికారుల బృందం విచ్చేసింది. శాంతిభద్రతల దృష్ట్యా రాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దింపారు...
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఎన్నికల ఫలితాల కోసం ఆ యా పార్టీ నేతలే కాదు... ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారంతా ఆతృతతో ఎదురు చూస్తున్నారు.
ఏపీలో వైఎస్సార్సీపీ (YSRCP) ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో దాడులు పెరిగిపోయాయి. ఏపీ సార్వత్రిక ఎన్నికలకు (AP Elections 2024) జరిగిన పోలింగ్ రోజు, మరుసటి రోజు నుంచి కూడా వైసీపీ మూకలు అల్లర్లకు పాల్పడుతున్నాయి. మరోసారి అధికారంలోకి ఎలాగైనా రావాలని పెద్ద ఎత్తున కుట్రలకు పాల్పడుతోంది.
తిరుపతి,తాడిపత్రి, అనంతపురం, పల్నాడు ప్రాంతాల్లో జరిగిన దాడులపై సిట్ ఉన్నత అధికారులకు తెలుగుదేశం పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు.దాడులకు సంబంధించి వివరాలను సాక్షాధారాలతో సీట్ అధికారులకు అందజేసినట్లు టీడీపీ సీనియర్ నేత వర్లరామయ్య (Varlaramaiah) తెలిపారు. మొత్తం 30 ఘటనలకు సంబంధించిన వివరాలు తమ రిప్రజెంటేషన్‌లో పొందుపరిచామని చెప్పారు.
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు (AP Elections 2024) పోలింగ్ ముగిసిన తర్వాత పలు జిల్లాల్లో అల్లర్లు జరిగాయి. ఈ ఘటనలపై ఎన్నికల కమిషన్ (Election Commission) సీరియస్ అయింది. ఏపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందని ప్రశ్నించింది.