AP Elections 2024:సిట్‌ను కలిసిన టీడీపీ నేతలు.. కారణమిదే
ABN , Publish Date - May 18 , 2024 | 07:44 PM
తిరుపతి,తాడిపత్రి, అనంతపురం, పల్నాడు ప్రాంతాల్లో జరిగిన దాడులపై సిట్ ఉన్నత అధికారులకు తెలుగుదేశం పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు.దాడులకు సంబంధించి వివరాలను సాక్షాధారాలతో సీట్ అధికారులకు అందజేసినట్లు టీడీపీ సీనియర్ నేత వర్లరామయ్య (Varlaramaiah) తెలిపారు. మొత్తం 30 ఘటనలకు సంబంధించిన వివరాలు తమ రిప్రజెంటేషన్‌లో పొందుపరిచామని చెప్పారు.
అమరావతి: తిరుపతి, తాడిపత్రి, అనంతపురం, పల్నాడు ప్రాంతాల్లో జరిగిన దాడులపై సిట్ ఉన్నత అధికారులకు తెలుగుదేశం పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు.దాడులకు సంబంధించి వివరాలను సాక్షాధారాలతో సీట్ అధికారులకు అందజేసినట్లు టీడీపీ సీనియర్ నేత వర్లరామయ్య (Varlaramaiah) తెలిపారు. మొత్తం 30 ఘటనలకు సంబంధించిన వివరాలు తమ రిప్రజెంటేషన్‌లో పొందుపరిచామని చెప్పారు. తప్పు చేసిన వారు ఎంతటివారినైనా వదిలే ప్రసక్తి లేదన్న సిట్ అధికారి వినీత్ బిజ్రల్ చెప్పారని అన్నారు.
చాలాకాలం తర్వాత స్వేచ్ఛగా డీజీపీ కార్యాలయానికి వచ్చామని చెప్పారు. ఇప్పటివరకు డీజీపీ కార్యాలయం వైసీపీ కార్యాలయం అనే భావన ఉండేదన్నారు. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డితో పాటు అల్లర్లకు కారకులైన వారిపై చర్యలు తీసుకుని వైసీపీ నాయకులు పేరు మోసిన దొంగల ముఠా అని విమర్శించారు. వైసీపీ నాయకులు ఎవరైతే అరాచకాలు చేశారో వారు రాష్ట్రం దాటి పారిపోయారని వర్ల రామయ్య ఆరోపించారు.
ఇవి కూడా చదవండి
Big Breaking: ఏపీలోని మూడు జిల్లాలకు ఎస్పీల నియామకం
YS Jagan: వైఎస్ జగన్ లండన్ వెళ్తుండగా.. గన్నవరం ఎయిర్‌పోర్టులో అసలేం జరిగింది..?
Read more AP News and Telugu News