Share News

AP Politics: కాస్కో అంటూ ముందుకొస్తున్న ఓ పార్టీ.. వెనక్కి తగ్గుతున్న మరో పార్టీ..

ABN , Publish Date - May 19 , 2024 | 03:13 PM

ఏపీలో ఎన్నికల పోలింగ్ ముగిసి వారం రోజులు కావొస్తుంది. ఫలితాల కోసం మరో 15 రోజులు ఆగాల్సిందే. ఈలోపు గెలుపుపై ఎవరి అంచనాలు వారివి. మరోవైపు పందేం రాయుళ్ల హడావుడి. నియోజకవర్గాలవారీ ఇప్పటికే కోట్లలో పందేలు నడుస్తున్నాయి. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేదానిపై ఇప్పటికే వందల కోట్ల రూపాయిలు పందేలు కట్టినట్లు తెలుస్తోంది. పోలింగ్ రోజు వరకు వైసీపీకి చెందిన నేతలు పందేలు కట్టేందుకు భారీగా ముందుకు రాగా.. ప్రస్తుతం సర్వే సంస్థల నుంచి వచ్చిన సమాచారం, గ్రామాల వారీ క్యాడర్ అందిస్తున్న వివరాలతో వైసీపీ నేతలు పందేలు కట్టడంలో కొంచెం వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.

AP Politics: కాస్కో అంటూ ముందుకొస్తున్న ఓ పార్టీ.. వెనక్కి తగ్గుతున్న మరో పార్టీ..
BJP, TDP, Janasena and YSRCP

ఏపీలో ఎన్నికల పోలింగ్ ముగిసి వారం రోజులు కావొస్తుంది. ఫలితాల కోసం మరో 15 రోజులు ఆగాల్సిందే. ఈలోపు గెలుపుపై ఎవరి అంచనాలు వారివి. మరోవైపు పందేం రాయుళ్ల హడావుడి. నియోజకవర్గాలవారీ ఇప్పటికే కోట్లలో పందేలు నడుస్తున్నాయి. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేదానిపై ఇప్పటికే వందల కోట్ల రూపాయిలు పందేలు కట్టినట్లు తెలుస్తోంది. పోలింగ్ రోజు వరకు వైసీపీకి చెందిన నేతలు పందేలు కట్టేందుకు భారీగా ముందుకు రాగా.. ప్రస్తుతం సర్వే సంస్థల నుంచి వచ్చిన సమాచారం, గ్రామాల వారీ క్యాడర్ అందిస్తున్న వివరాలతో వైసీపీ నేతలు పందేలు కట్టడంలో కొంచెం వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. కూటమిపై పందేం కట్టేందుకు ఎక్కవమంద ఆసక్తి చూపిస్తుండగా.. వైసీపీపై పందేం వేసేందుకు సొంత పార్టీ నాయకులే వెనకడుగు వేస్తున్నారట.


ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఓ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి గెలుస్తారంటూ రూ.30 లక్షల రూపాయిలు బెట్ కాసేందుకు రెడీ అయిన ఓ వ్యక్తి.. పోలింగ్ ముగిసిన తర్వాత.. వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఇలా ఒకరో ఇద్దరో కాదు.. పోలింగ్ సరళి చూసిన తర్వాత వేలాది మంది వైసీపీకి అనుకూలంగా బెట్టింగ్ వేద్దామనుకుని వెనక్కి తగ్గారట. కూటమి గెలుపు పక్కా అంటూ భారీగా బెట్టింగ్‌లు కట్టేందుకు ముందుకు వస్తున్న నేపథ్యంలో వైసీపీ శ్రేణులు వెనక్కి తగ్గుతుండటం తీవ్ర చర్చకు దారితీస్తోంది.

Congress: ప్రజాస్వామ్య దేశంలో అద్భుతాలు జరుగుతున్నాయి: చింతా మోహన్


జగన్ ప్రకటన తర్వాత..

పోలింగ్ తర్వాత వైసీపీకి 151 సీట్లు వస్తాయంటూ సీఎం జగన్ ప్రకటించారు. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు, ఫలితాల వరకు క్యాడర్‌ను యాక్టివ్‌గా ఉంచడం కోసం జగన్ ఇటువంటి ప్రకటన చేసి ఉండొచ్చు . కానీ వైసీపీ శ్రేణులు మాత్రం జగన్ ప్రకటనపై విశ్వాసం ఉంచడంలేదట. క్షేత్రస్థాయిలో ఓటర్లు ఎన్డీయే కూటమివైపే మొగ్గుచూపారనే సంకేతాలు వెలువడటం, ఓటింగ్ శాతం పెరగడం ప్రభుత్వానికి వ్యతిరేక తీర్పు వచ్చే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈక్రమంలో జగన్‌ మాటలను సొంత పార్టీ నేతలే నమ్మే పరిస్థితులు కనిపించడం లేదట. ఓవైపు సోషల్ మీడియాలో వైసీపీ సానుభూతిపరులు, అభిమానులు జగన్ మరోసారి సీఎం అవుతారంటూ ప్రచారం చేస్తున్నా.. ఆ పార్టీ నాయకులు పందేం కాసేందుకు విముఖత చూపిస్తున్నట్లు తెలుస్తోంది. పోలింగ్ రోజు వరకు పందేం కాసేందుకు క్యూ కట్టిన వైసీపీ నాయకులు.. పోలింగ్ ముగిసిన రెండు రోజుల తర్వాత మాత్రం వెనక్కి తగ్గారన్న చర్చ జరుగుతోంది.


సర్వే సంస్థల అంచనాలతో..

జూన్1 వరకు ఎగ్జిట్‌పోల్స్‌పై ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. దీంతో బెట్టింగ్ రాయుళ్లు నేరుగా సర్వే సంస్థల ప్రతినిధులను సంప్రదించి.. ట్రెండ్ ఎలా ఉంటుందో చెప్పాలంటూ తీవ్ర ఒత్తిడి చేస్తున్నారట. ఒకట్రెండు సంస్థలు వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పినప్పటికీ.. అంత కాన్ఫిడెంట్‌గా చెప్పలేకపోతున్నారని, మెజార్టీ సంస్థలు ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తాయని అంచనా వేస్తుండటంతో కూటమిపైనే ఎక్కువ మంది బెట్టింగ్‌లు వేస్తున్నారట.


చట్ట ప్రకారం బెట్టింగ్‌‌లు వేయడం తీవ్రమైన నేరం. అయినప్పటికీ కొంతమంది జూదానికి అలవాటుపడి బెట్టింగ్‌లు కాస్తున్నట్లు తెలుస్తోంది. బెట్టింగ్ అనేది అదృష్టంపై ఆధారపడి మాత్రమే ఉంటుంది. కేవలం అంచనాలపై ఆధారపడి బెట్టింగ్‌ కాయడం వలన ఎంతోమంది తమ ఆస్తులు పొగొట్టుకుంటున్న పరిస్థితులు సమాజంలో కనిపిస్తున్నాయి. బెట్టింగ్‌లు చట్టరీత్యా అనుమతించబడవని, ఎవరైనా ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్‌లకు పాల్పడితే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.


AP Elections: సీఎం వైఎస్ జగన్‌పై.. జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read Latest AP News and Telugu News

Updated Date - May 19 , 2024 | 03:13 PM