Home » AP Assembly Elections 2024
ఏపీలో ఐదేళ్లలో వైసీపీ (YSRCP) నేతలు పెట్రేగిపోయారు. వారు సృష్టించిన అరాచకం, దాడులు అన్ని ఇన్ని కావు. సామాన్యులపై దాడులు చేస్తూ ఈ ఐదేళ్లలో ఎన్నో రకాలుగా భయభ్రాంతులకు గురిచేశారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ ముగిసిన తర్వాత రాష్ట్రంలో పలు ఘర్షణలు, అల్లర్లు నెలకొన్నాయి. దీంతో కేంద్ర ఎన్నికల కమిషన్ (Central Election Commission) చర్యలు చేపట్టింది. ఈ మేరకు పల్నాడు కలెక్టర్, పలు జిల్లాల ఎస్పీలపై చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు పడింది.
సుప్రీంకోర్టులో వైసీపీ అధినేత, సీఎం వైయస్ జగన్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. వైయస్ వివేకా హాత్య కేసు అంశాన్ని ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించ కూడదంటూ కడప కోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు శుక్రవారం స్టే విధించింది. అలాగే వైయస్ షర్మిలతో పాటు ఇతరులపై దాఖలైన కోర్టు ధిక్కరణ కేసులపైనా కూడా సుప్రీంకోర్టు స్టే విధించింది.
ఏపీకి నిఘా విభాగం హెచ్చరికలు జారీ చేసింది. ఎన్నికల ఫలితాల తర్వాత ప్రతీకార దాడులకు అవకాశం ఉందని వార్నింగ్ ఇచ్చింది. జూన్ 19 వరకూ పోలీసు బలగాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అవసరమైతే కేంద్ర బలగాలను మోహరించాలని ఇంటెలిజెన్స్ తెలిపింది. ఈ మేరకు జిల్లాల ఎస్పీలు, కలెక్టర్లకు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసింది.
జోగి రమేష్ ను అభ్యర్థిగా ప్రకటించిప్పటి నుంచి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అనేక అక్రమాలకు పాల్పడ్డారని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ విమర్శించారు. ఇబ్రహీంపట్నంలో నివాసం ఉంటే అతని కుటుంబ సభ్యులకు పెనమలూరులో ఓటు హక్కు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. రెవెన్యూ అధికారులతో పాటు ఉయ్యూరు సీఐ, కంకిపాడు, పెనమలూరు స్టేషన్లో ఎస్ఐలను కూడా పెడన నుంచి ఇక్కడకు బదిలీ చేయించుకుని ఎన్నికల్లో అనేక అక్రమాలకు పాల్పడ్డారన్నారు.
పల్నాడు జిల్లాలో బొల్లాపల్లి ఎస్ఐపై వైసీపీ నేతలు దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల13న బొల్లాపల్లి ఎస్ఐ చెన్నకేశవులుపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. తెలుగు యువత నాయకుడు పోక వెంకట్రావు కారుపై దాడి చేసి బొల్లాపల్లి వైసీపీ నాయకులు హత్యాయత్నం చేశారు.
రాష్ట్రంలో పోలింగ్ అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల కమిషన్ భగ్గుమంది. మునుపెన్నడూ లేని విధంగా... అసాధారణ రీతిలో జిల్లా కలెక్టర్, ఎస్పీలు, 12 మంది దిగువస్థాయి పోలీసు అధికారులపై బదిలీ, సస్పెన్షన్ వేటు, శాఖాపరమైన విచారణకు ఆదేశాలు జారీ చేసింది. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో విచ్చలవిడిగా దాడులు జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై మండిపడింది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ నేపథ్యంలో ఈవీఎంల రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారిని కోరానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు.
జూన్ 4వ తేదీ లోపు మరిన్ని దాడులు జరగవచ్చని.. ఈ నేపథ్యంలో చాలా అప్రమత్తంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఆ పార్టీ నాయకుడు, ఉండి అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి రఘురామకృష్ణరాజు సూచించారు.
భారీ భద్రత మధ్య తాడిపత్రిలోని జేసీ దివాకర్ రెడ్డి ఫ్యామిలీని పోలీసులు హుటాహుటిన హైదరాబాద్ తరలించారు.