AP Elections 2024: ఏపీలో పలువురు అధికారుల బదిలీలు.. కారణమిదే..?
ABN , Publish Date - May 17 , 2024 | 02:45 PM
ఏపీ సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ ముగిసిన తర్వాత రాష్ట్రంలో పలు ఘర్షణలు, అల్లర్లు నెలకొన్నాయి. దీంతో కేంద్ర ఎన్నికల కమిషన్ (Central Election Commission) చర్యలు చేపట్టింది. ఈ మేరకు పల్నాడు కలెక్టర్, పలు జిల్లాల ఎస్పీలపై చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు పడింది.
అమరావతి: ఏపీ సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ ముగిసిన తర్వాత రాష్ట్రంలో పలు ఘర్షణలు, అల్లర్లు నెలకొన్నాయి. దీంతో కేంద్ర ఎన్నికల కమిషన్ (Central Election Commission) చర్యలు చేపట్టింది. ఈ మేరకు పల్నాడు కలెక్టర్, పలు జిల్లాల ఎస్పీలపై చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు పడింది.
కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పల్నాడు కలెక్టర్ శివశంకర్‌ను ఏపీ ప్రభుత్వం శుక్రవారం బదిలీ చేసింది. ఆయనను జీఏడీలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. పల్నాడు జాయింట్ కలెక్టర్‌కు బాధ్యతలు అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది. పల్నాడు కలెక్టర్‌తో పాటు తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పాటిల్‌ను బదిలీ చేస్తూ ఏపీ సీఎస్ కేఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. కృష్ణకాంత్‌ను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
AP Elections: జగన్‌కు దెబ్బ.. చెల్లెళ్లకు ఊరట
పల్నాడు ఎస్పీ బింధుమాధవ్‌ను కూడా సస్పెండ్ చేస్తూ సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. అనంతపురం ఎస్పీ అమిత్ బర్ధర్‌ను కూడా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పల్నాడు, అనంతపురం ఎస్పీలను హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లవద్దని ఆదేశించారు. అధికారుల బదిలీ, సస్పెన్షన్ ఉత్తర్వులను కేంద్ర ఎన్నికల సంఘానికి సీఎస్ జవహర్ రెడ్డి పంపించారు.
ఈసీకి ప్యానల్‌ను పంపించిన ఏపీ ప్రభుత్వం
ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల స్థానంలో ఇతర అధికారులను నియమించేందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఏపీ ప్రభుత్వం రెండు ప్యానళ్లను పంపించింది. పల్నాడు జిల్లా కలెక్టర్ నియామకానికి జీ. వీరపాండ్యాన్ (ఏపీ సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ వీసీ అండ్ ఎండీ) పేరుతో ప్యానల్‌ను పంపించింది. ఆయా జిల్లాల ఎస్పీల పరిశీలనకు ఏపీ ప్రభుత్వం పలు పేర్లను సూచించింది.
వీరిలో.. సాలి గౌతమి(విశాఖపట్నం ఏపీ ఎస్పీ 16వ బెటాలియన్ కమాండెంట్), మల్లికా గార్గ్ (సీఐడీ ఎస్పీ), వి హర్షవర్ధన్ రాజు(సీఐడీ, ఎస్పీ), డి నరసింహ కిషోర్ (తిరుపతి, టీటీడీ సీవీ అండ్ ఎస్వో) విజయవాడ, జగ్గయ్యపేట డీసీపీలతో పాటు లత్క ర్ శ్రీకేష్ బాలాజీ (మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అండ్ డైరెక్టర్) చేవూరి హరికిరణ్( అగ్రికల్చర్ స్పెషల్ కమిషనర్ల) పేరుతో మరో జాబితాను కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఏపీ ప్రభుత్వం పంపించింది.
కాగా.... ఏపీలోని పలు జిల్లాలో పోలింగ్ రోజు(మే13 ) నుంచి అల్లర్లు, అరాచకాలు జరుగుతున్న విషయం తెలిసిందే. వీటిపై కేంద్ర ఎన్నికల కమిషన్ పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేసింది. అల్లర్లను అదుపు చేయడంలో ఆయా జిల్లాల అధికారులు నిర్లక్ష్యం వహించారని ఎన్నికల కమిషన్ మండిపడింది. ఈ మేరకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి
Elections 2024: వైసీపీ గూండాలకు రోజులు దగ్గరపడ్డాయి: విష్టుకుమార్ రాజు
Raghurama: కూటమికి 125 సీట్లు పక్కా: రఘురామకృష్ణంరాజు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News