Home » AP Assembly Elections 2024
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ మొత్తం 7 దశల్లో జరిగాయి. జూన్ 1వ తేదీ సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వెల్లడయ్యాయి. ఆ క్రమంలో ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై పలు సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. అందులోభాగంగా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి గెలుస్తుందని కొన్ని సర్వే సంస్థలు వెల్లడించాయి.
లోక్ సభ ఎన్నికల్లో విశాఖ పట్నం నుంచి, అసెంబ్లీ ఎన్నికల్లో గాజువాక నుంచి పోటీ చేసిన కుండ గుర్తుపై పోటీ చేసిన కేఏ పాల్‌కి(KA Paul) షాక్ తగిలింది.
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ జూన్ 4వ తేదీ జరగనుంది. అయితే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారం చేపట్టనుందనే దానిపైనే సర్వత్ర ఆసక్తి రేపుతోంది.
దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు-2024, ఆంధ్రప్రదేశ్, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు (మంగళవారం) వెల్లడి కానున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. దేశవ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిపింది.
ఆంధ్రప్రదేశ్‌లో పోస్టల్ బ్యాలెట్ల పంచాయితీ సుప్రీంకోర్టుకు చేరింది. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్‌కు సంబంధించి ఫాం-13ఏపై అటెస్టింగ్ అధికారి సంతకం ఉండి, హోదా వివరాలు లేకపోయినా బ్యాలెట్ చెల్లుబాటవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు హైకోర్టు డివిజన్ బెంచ్ నిరాకరించడాన్ని వైసీపీ సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్ చేసింది.
మాచర్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) ముందస్తు బెయిల్ రద్దుపై రేపు(సోమవారం) సుప్రీంకోర్టులో(Supreme Court) విచారణ జరుగనున్నది. జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ సందీప్ మెహతా నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణ చేపట్టునున్నది.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో (AP Elections) ఏ పార్టీ గెలవబోతోంది..? అనేదానిపై ఎగ్జిట్ పోల్స్ (AP Exit Polls) క్లియర్ కట్‌గా తేలిపోయిన సంగతి తెలిసిందే. ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో ప్రముఖ సర్వే, మీడియా సంస్థలు కూటమిదే గెలుపని తేల్చి చెప్పేశాయి.. తాజాగా ఇండియా టుడే తన సంచలన సర్వేను రిలీజ్ చేసింది..
ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పాపాలు ఈ నెల 4వ తేదీతో పండనుందని అమరావతి రైతు ఆలూరి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఇంతటితో ఆయన పరిపాలన అంతమవుతుందని ఆయన స్పష్టం చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇటువంటి ముఖ్యమంత్రిని తాము ఎన్నడూ చూడలేదన్నారు.
లోకమంతా ఒకవైపు.. సీఎం జగన్ మరోవైపు అన్నట్లుగా వైసీపీ వ్యవహరిస్తోంది. ఎగ్జిట్‌పోల్స్‌లో టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందని పీపుల్స్ పల్స్, రైజ్ తదితర సంస్థలు పేర్కొన్నాయి. ప్రజల్లో జగన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని స్పష్టం చేశాయి. ఊరూపేరూ లేని అనామక సంస్థలు వైసీపీయే అధికారంలోనికి వస్తుందంటూ ఇచ్చిన ఫలితాలను జగన్‌కు చెందిన చెందిన నీలి, కూలి మీడియాలో ప్రముఖంగా ప్రచారం చేసుకుని ప్రభుత్వ పెద్దలు సంతృప్తి చెందుతున్నారు. ఈ సంస్థలూ జగన్ చెప్పినట్లుగా 151 స్థానాలకు మించి వస్తాయని పేర్కొనలేదు
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో నానా గందరగోళం సృష్టించడానికి జగన్ సర్కారు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఎన్నికల కమిషన్ ఉత్తర్వులను సవాలు చేస్తూ వైసీపీ నేతలు హైకోర్టుకు వెళ్లినా ఊరట దక్కలేదు. దీంతో వారి కన్ను సర్వీసు ఓట్లపై పడిందన్న ఆరోపణలు వస్తున్నాయి.