Share News

Supreme Court: పిన్నెల్లి ముందస్తు బెయిల్ రద్దుపై రేపు సుప్రీంలో విచారణ

ABN , Publish Date - Jun 02 , 2024 | 10:38 PM

మాచర్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) ముందస్తు బెయిల్ రద్దుపై రేపు(సోమవారం) సుప్రీంకోర్టులో(Supreme Court) విచారణ జరుగనున్నది. జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ సందీప్ మెహతా నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణ చేపట్టునున్నది.

Supreme Court: పిన్నెల్లి ముందస్తు బెయిల్ రద్దుపై రేపు సుప్రీంలో విచారణ
Pinnelli Ramakrishna Reddy

ఢిల్లీ: మాచర్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) ముందస్తు బెయిల్ రద్దుపై రేపు(సోమవారం) సుప్రీంకోర్టులో(Supreme Court) విచారణ జరుగనున్నది. జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ సందీప్ మెహతా నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణ చేపట్టునున్నది. సుప్రీంకోర్టును మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి బాధితుడు నంబూరి శేషగిరిరావు ఆశ్రయించిన విషయం తెలిసిందే.పిన్నెల్లి నుంచి తనకు ప్రాణహాని ఉందని, ఏపీ హైకోర్టు ఇచ్చిన అరెస్టు మినహాయింపు ఆదేశాలను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో శేషగిరిరావు పిటిషన్ దాఖలు చేశారు.


మే 13న జరిగిన పోలింగ్ రోజు ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో తనపై దాడి చేశారని బాధితుడు పేర్కొన్నారు. ఈవీఎం పగలకొట్టిన ఘటనలో ఈనెల 6వ తేదీ వరకు పిన్నెల్లిని అరెస్టు చేయవద్దని ఏపీ హైకోర్టు ఉత్తర్వులు కొట్టివేయాలని శేషగిరిరావు విజ్ఞప్తి చేశారు. పోలింగ్ రోజు హింసకు పాల్పడిన ఎమ్మెల్యే.. కౌంటింగ్ రోజు కూడా పాల్పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ నంబూరి శేషగిరిరావు సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఈవీఎం పగులకొట్టిన కొట్టిన ఘటనపై కూడా శేషగిరిరావు మరో పిటిషన్ దాఖలు చేశారు.


ఈవీఎం పగలకొట్టిన ఘటనలో పక్కా సాక్ష్యాలు ఉన్నా, సీసీటీవీ రికార్డు ఉన్నా... స్థానిక వీఆర్వో ఎమ్మెల్యే పేరు, ఆయన అనుచరుల పేర్లు కూడా లేకుండా కేసు పెట్టారని శేషగిరిరావు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు ఘటనకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొంటూ ఎమ్మెల్యేకు అనుకూలంగా వ్యవహరించారని శేషగిరిరావు సుప్రీంకోర్టుకు తెలిపారు. ఈ విషయాలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోకుండా ముందస్తు బెయిల్ ఇచ్చిందని శేషగిరిరావు పేర్కొన్నారు. హత్యాయత్నం, ఈవీఎం పగులకొట్టిన ఘటనలు రెండూ తీవ్రమైనవి అయినా... బెయిల్ మంజూరు చేయడం ఆందోళన కలిగిస్తున్నాయని పిటిషన్లలో శేషగిరిరావు ఆవేదన వ్యక్తం చేశారు.


ఎమ్మెల్యే పిన్నెల్లి నుంచి ప్రాణహాని ఉన్నందున... తనకు భద్రత కల్పించాలని, రెండు కేసుల్లో ఇచ్చిన అరెస్టు మినహాయింపును రద్దు చేయాలని విన్నవించారు. మాచర్ల నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎవరూ స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదన్నారు. పిన్నెల్లి లేకపోయినా... ఆయన ఏజంట్ ద్వారా అయినా కౌంటింగ్ ప్రక్రియ పరిశీలించే అవకాశం ఉందన్నారు. పిన్నెల్లి స్వయంగా... కౌంటింగ్ దగ్గర ఉంటే మళ్లీ హింస ప్రజ్వరిల్లే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఒక భయానక వాతావరణం నెలకొని ఉందని, పిన్నెల్లి బయట ఉంటే.. అంది ఇంకా పెరిగే ప్రమాదం ఉందని తెలిపారు.


కౌంటింగ్ రోజు పిన్నెల్లి బయట ఉంటే ఈనెల 4న మాచర్ల అంతా హింసాత్మక ఘటనలతో అట్టుడికే ప్రమాదం ఉందని శేషగిరిరావు ఆందోళన వ్యక్తం చేశారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, గత నెల 13న ఎన్నికల హింసకు పాల్పడిన ఆధారాలు స్పష్టంగా ఉన్నా... ఏపీ హైకోర్టు వాటిని పట్టించుకోకుండా... అరెస్టు నుంచి మినహాయింపు ఇచ్చిందని పిటిషనర్ పేర్కొన్నారు. శేషగిరిరావు దాఖలు చేసిన రెండు పిటిషన్లపై సుప్రీంకోర్టు రేపు విచారణ చేపట్టనున్నది.


ఈ వార్తలు కూడా చదవండి

AP Elections 2024: ఆరా మస్తాన్ సర్వే ఎవరి తరఫున చేశారు.. ఖర్చు ఎంత..!?.. సీఎం రమేష్ షాకింగ్ కామెంట్స్

AP Elections 2024: కౌంటింగ్ రోజు ఘర్షణలు సృష్టించే అవకాశం: నాందెడ్ల మనోహర్

AP Elections2024 : ఎగ్జిట్ పోల్స్ కంటే కూటమికి ఎక్కువ స్థానాలు: అప్పలనాయుడు

For more latest Andhrapradesh news and Telugu news..

Updated Date - Jun 02 , 2024 | 10:42 PM