Share News

AP Exit Polls 2024: ఏపీలో గెలిచేదెవరో తేల్చి చెప్పిన ఇండియా టుడే సర్వే

ABN , Publish Date - Jun 02 , 2024 | 06:29 PM

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో (AP Elections) ఏ పార్టీ గెలవబోతోంది..? అనేదానిపై ఎగ్జిట్ పోల్స్ (AP Exit Polls) క్లియర్ కట్‌గా తేలిపోయిన సంగతి తెలిసిందే. ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో ప్రముఖ సర్వే, మీడియా సంస్థలు కూటమిదే గెలుపని తేల్చి చెప్పేశాయి.. తాజాగా ఇండియా టుడే తన సంచలన సర్వేను రిలీజ్ చేసింది..

AP Exit Polls 2024: ఏపీలో గెలిచేదెవరో తేల్చి చెప్పిన ఇండియా టుడే సర్వే

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో (AP Elections) ఏ పార్టీ గెలవబోతోంది..? ఘోర ఓటమిని చవి చూసేదెవరు..? అనేదానిపై ఇప్పటికే లోకల్, నేషనల్ మీడియా.. పేరుగాంచిన సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్‌లో (AP Exit Polls) క్లియర్ కట్‌గా తేలిపోయిన సంగతి తెలిసిందే. ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో సర్వే సంస్థలు కూటమిదే గెలుపని తేల్చి చెప్పేశాయి.. తాజాగా ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా సంచలన సర్వేను రిలీజ్ చేసింది. ఈ సర్వేలోనూ కూటమి గెలిచింది. దీంతో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. దేశం మొత్తమ్మీద ఇప్పటి వరకూ రిలీజ్ చేసిన జాతీయ మీడియా సర్వేల్లో ఇండియా టుడేకు ప్రత్యేక స్థానం ఉంది.. ఈ సంస్థ సర్వేలు అక్షరాలా నిజమైన సందర్భాలు కోకొల్లలు. అందుకే.. ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎప్పుడెప్పుడు వస్తాయా..? అని యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన పరిస్థితి. అయితే.. అనుకున్న టైమ్‌కు ఫలితాలు రిలీజ్ చేయలేకపోయినా మరుసటిరోజు అదే సమయానికి విడుదల చేసింది.


India-Today-Axis-My-India.jpg

లేటుగా అయినా..!

ఆంధ్రప్రదేశ్‌‌ ఎన్నికల్లో గెలిచేది కూటమియేనని ఇండియా టుడే తేల్చి చెప్పింది. కూటమి 98-120 వరకూ సీట్లతో అధికారంలోకి రాబోతోందని సర్వేలో తేలింది. అంతేకాదు.. కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీకి విడివిడిగా ఎన్ని సీట్లు వస్తాయనేదానిపై కూడా లెక్కలు చెప్పింది. టీడీపీకి 78-96, జనసేనకు16-18, బీజేపీకి 04-06 సీట్లు వస్తాయని ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియాలో సర్వేలో క్లియర్ కట్‌గా చెప్పేసింది. కాంగ్రెస్ పార్టీకి 0-2 సీట్లు రావొచ్చని సర్వే చెబుతోంది. ఇక వైసీపీకి అయితే ఘోరాతి ఘోరంగా సీట్లు వస్తాయని ఈ సర్వేలో తేలడం గమనార్హం. సో.. సర్వే లేటుగా వచ్చినా లేటెస్ట్‌గా చెప్పిందని కూటమి పార్టీల కార్యకర్తలు పండుగ చేసుకుంటున్నారు.


TDP-vs-YSRCP.jpg

బాబోయ్.. ఏంటిది..?

ఇండియా టుడే సర్వే ప్రకారం వైసీపీకి కేవలం 55-77 సీట్లు వస్తాయని తేలింది. అంటే గత ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాలు రాగా.. ఈసారి ఏకంగా 100 స్థానాలు తగ్గుతాయని సర్వే చెప్పడం గమనార్హం. వాస్తవానికి గత ఎన్నికల్లో ఇదే వైసీపీకి 119-135 సీట్లు వస్తాయని ఇండియా టుడేనే చెప్పింది. ఇప్పుడు అదే సర్వేనే ఇంత ఘోరంగా వైసీపీ ఓడిపోతోందని చెప్పడంతో ఆ పార్టీ నేతలు అయోమయంలో పడ్డారు. ఇప్పటి వరకూ ఎగ్జిట్ పోల్స్ చూశాం కదా.. ఇవన్నీ ఎంతవరకూ నిజం అవుతాయి..? ఎగ్జాక్ట్ పోల్స్‌లో ఏం తేలుతుంది..? అనేది మరికొన్ని గంటల్లో చూద్దాం..!

Updated Date - Jun 02 , 2024 | 07:36 PM