Home » AP Assembly Elections 2024
మాచర్ల నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి(Pinnelli Ramakrishna Reddy) ఏపీ హైకోర్టులో(AP High Court) భారీ షాక్ తగిలింది. ఆయన కదలికలపై ఏపీ హైకోర్టు ఆంక్షలు విధించింది. పిన్నెల్లి మాచర్లకు వెళ్ల కూడదని ఆదేశాలు జారీ చేసింది.
సీఎం జగన్‌పై (CM Jagan) ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి(YS Sharmila) మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో షర్మిల కడప ఎంపీగా పోటీచేసిన విషయం తెలిసిందే.
ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, ఏపీ సీఎస్ జవహర్ రెడ్డిపై ఎన్నికల సంఘానికి (Electoral Commission) తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) నేతలు ఫిర్యాదు చేశారు.ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనాను టీడీపీ నేతలు వర్ల రామయ్య , దేవినేని ఉమామహేశ్వరరావు, పల్లె రఘునాథరెడ్డి శుక్రవారం కలిశారు. ఈ మేరకు ఓ వినతి పత్రాన్ని అందజేశారు.
యూపీఎస్సీ చైర్మన్ డాక్టర్ మనోజ్ సోనీకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ( Nara Chandrababu Naidu) శుక్రవారం లేఖ రాశారు. ఐఏఎస్‌కు రాష్ట్ర కేడర్ ఆఫీసర్ల ఎంపిక కార్యక్రమాన్ని మోడల్ కోడ్ ఉన్నప్పుడు చేయడం సముచితం కాదని చెప్పారు. కొత్త ప్రభుత్వం వచ్చే వరకు జరపకూడదని యూపీఎస్సీని చంద్రబాబు కోరారు.
వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల నుంచి పారిపోవడానికి పోలీసులే సహకరించారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. గురువారం అమరావతి సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖే్‌షకుమార్ మీనాను కలిసి పలు అంశాలపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు.
చంద్రగిరి, సత్తెనపల్లి నియోజకవర్గాల పరిధిలోని వివిధ బూత్‌ల్లో రీపోలింగ్ నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ వైసీసీ అభ్యర్థులు దాఖలు చేసిన వ్యాజ్యాలను హైకోర్టు కొట్టివేసింది. గురువారం వ్యాజ్యాలు విచారణకు రాగా కేంద్ర ఎన్నికల సంఘం తరఫున సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపించారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికలకు జరిగిన పోలింగ్, ఆ మరుసటి రోజు నుంచి ఏపీలో జరిగిన అల్లర్లు, అరాచకాలపై మరోసారి డీజీపీ హరీష్ కుమార్ గుప్తా (DGP Harish Kumar Gupta)కు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Umamaheswara Rao) ఫిర్యాదు చేశారు.
ఛలో మాచర్లకు (Chalo Macherla) తెలుగుదేశం పార్టీ (TDP) గురువారం పిలుపిచ్చింది. ఈ నెల 13న జరిగిన పోలింగ్ (Polling) సందర్భంగా వైసీపీ (YSRCP) మూకల దాడుల్లో గాయపడిన బాధితులను టీడీపీ నేతలు పరామర్శించనున్నారు. మాచర్ల టీడీపీ ఇన్ చార్జ్ జూలకంటి బ్రహ్మరెడ్డి (Julakanti Brahma Reddy) ఇంటి నుంచి నేతల బృందం బయలుదేరింది.
పల్నాడు జిల్లాల్లో ఏపీ సార్వత్రిక ఎన్నికలకు (AP Elections 2024) పోలింగ్ జరిగిన రోజు, ఆ తర్వాత అల్లర్లు, అరాచకాలు జరుగుతున్నాయి. అయితే ఈ అల్లర్లలో పెద్దఎత్తున రిగ్గింగ్‌కు పాల్పడ్డారని మంత్రి అంబటి రాంబాబు ఆరోపిస్తున్నారు.
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. పోలింగ్ బుత్‌లో ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో.. ప్రస్తుతం అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఘటనపై విచారణ జరిపి నివేదిక అందజేయాలని ఇప్పటికే సీఈసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.