AP Election 2024: ఎన్నికల కౌంటింగ్‌కు సీఎస్ జవహర్ రెడ్డిని పక్కన పెట్టాలి: దేవినేని ఉమ
ABN , Publish Date - May 24 , 2024 | 06:49 PM
ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, ఏపీ సీఎస్ జవహర్ రెడ్డిపై ఎన్నికల సంఘానికి (Electoral Commission) తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) నేతలు ఫిర్యాదు చేశారు.ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనాను టీడీపీ నేతలు వర్ల రామయ్య , దేవినేని ఉమామహేశ్వరరావు, పల్లె రఘునాథరెడ్డి శుక్రవారం కలిశారు. ఈ మేరకు ఓ వినతి పత్రాన్ని అందజేశారు.
అమరావతి: ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, ఏపీ సీఎస్ జవహర్ రెడ్డిపై ఎన్నికల సంఘానికి (Electoral Commission) తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) నేతలు ఫిర్యాదు చేశారు.ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనాను టీడీపీ నేతలు వర్ల రామయ్య , దేవినేని ఉమామహేశ్వరరావు, పల్లె రఘునాథరెడ్డి శుక్రవారం కలిశారు. ఈ మేరకు ఓ వినతి పత్రాన్ని అందజేశారు.
అలా చేస్తే పిన్నెళ్లికి బెయిల్ వచ్చేది కాదు: దేవినేవి ఉమ
ఎన్నికల కౌంటింగ్‌కు సీఎస్ జవహర్ రెడ్డిని పక్కన పెట్టాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Umamaheswara Rao) డిమాండ్ చేశారు. ఎలక్షన్ కమిషన్ అధికారులతో కౌంటింగ్ నిర్వహించాలని కోరారు. ఎన్ని టేబుళ్లలో కౌంటింగ్ చేస్తున్నారని సీఈఓ ఎంకే మీనాను అడిగామని చెప్పుకొచ్చారు మాచర్ల ఎమ్మెల్యే. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దౌర్జన్యం చేసిన పోలింగ్ సెంటర్‌లో టీడీపీ ఏజంట్ శేషగిరి రావును బెదిరించాడన్నారు. శేషగిరిరావు బయటకు రాగానే పిన్నెల్లి, అతని అనుచరులు తల పగులగొట్టారని ధ్వజమెత్తారు. పోలీసులు సకాలంలో కేసులు పెట్టి ఉంటే పిన్నెల్లికి బెయిల్ వచ్చేది కాదని దేవినేని ఉమ అన్నారు.
ఏజెంట్లను వైసీపీ నేతలు బెదిరించారు: పల్లె రఘునాధరెడ్డి
నల్లమాడలో తమ ఏజెంట్లను వైసీపీ నేతలు బెదిరించారని మాజీ మంత్రి పల్లె రఘునాధరెడ్డి (Raghunadha Reddy) చెప్పారు. శ్రీధర్ రెడ్డి ప్రోద్బలంతో తమ వాహనాలపై దాడులు చేశారని మండిపడ్డారు. ఈ విషయాలు సీఈఓ ఎంకే మీనా దృష్టికి తీసుకెళ్లామని పల్లె రఘునాధరెడ్డి అన్నారు.
పోలీసులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి:టీడీపీ నేతలు
పోలీసుల సమస్యలను పరిష్కరించాలని తెలుగుదేశం పార్టీ నాయకులు మహ్మద్ ఇక్బాల్, ఎం.ఎస్ బేగ్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాకు టీడీపీ నేతలు వినతి పత్రం అందజేశారు. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న పోలీసులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరారు. జూన్-4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న తరుణంలో పోలీసులకు తగిన బాధ్యతలు అప్పగించాలని కోరారు. ఎలక్షన్ డ్యూటీలో ఉన్న పోలీసులకు అలవెన్స్‌లు సకాలంలో అందించాలని డిమాండ్ చేశారు. బందోబస్త్‌లో పాల్గొంటున్న పోలీసులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని టీడీపీ నేతలు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మోదీకి పదవీకాంక్ష పీక్స్‌కు చేరింది: కూనంనేని
బంగాళాఖాతంలో బలపడుతున్న రెమాల్ తుఫాను
మంత్రివర్గ విస్తరణపై రేవంత్ రెడ్డి ఫోకస్..!
పోలీసులకు నోటీసులు పంపిస్తా..: శ్రీకాంత్
Read Latest APNews and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News