Share News

AP Elections: పిన్నెల్లి ఇలా.. ఎలా దొరికిపోయాడు..!

ABN , Publish Date - May 23 , 2024 | 04:02 PM

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. పోలింగ్ బుత్‌లో ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో.. ప్రస్తుతం అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఘటనపై విచారణ జరిపి నివేదిక అందజేయాలని ఇప్పటికే సీఈసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

AP Elections: పిన్నెల్లి ఇలా.. ఎలా దొరికిపోయాడు..!
Pinnelli Ramakrishna Reddy

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. పోలింగ్ బుత్‌లో ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో.. ప్రస్తుతం అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఘటనపై విచారణ జరిపి నివేదిక అందజేయాలని ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఈ కేసులో పిన్నెల్లికి రెండేళ్ల నుంచి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందనే ఓ చర్చ సైతం రాజకీయ వర్గాల్లో వైరల్ అవుతుంది.

అలాంటి వేళ మే 13న పోలింగ్ జరిగింది. ఆ తర్వాత దాదాపు వారం రోజులకు ఈ పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో ఎలా బయటకు వచ్చిందనే అంశంపై సదరు వర్గాల్లో ఓ చర్చ సైతం నడుస్తుంది. రాష్ట్రంలో పోలింగ్ అనంతరం పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో ఘర్షణలు చెలరేగాయి. వీటిపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఆ క్రమంలో సీఎస్‌, డీజీపీలను ఢిల్లీ వచ్చి వివరణ ఇవ్వాలంటూ ఈసీ ఆదేశించింది.

LokSabha Elections: మళ్లీ మేమే వస్తాం


ఆ క్రమంలో వారు ఢిల్లీ వెళ్లడం.. ఈ ఘర్షణలపై ఈసీకి వారు నివేదిక అందించడం చక చకా జరిగిపోయాయి. ఈ ఘర్షణలపై సిట్ ఏర్పాటు చేసి.. నివేదిక అందజేయాలంటూ సీఎస్‌ను ఈసీ ఈ సందర్భంగా ఆదేశించింది. దీంతో పోలింగ్ అనంతరం చోటు చేసుకున్న ఘర్షణలపై సిట్ విచారణ చేపట్టింది. అందులోభాగంగా ఈవీఎంల ధ్వంసం అంశం వెలుగులోకి వచ్చిందని తెలుస్తుంది.

దాంతో పోలింగ్ బుత్‌ల్లో ఏర్పాటు చేసిన వీడియోలను సిట్ అధికారులు పరిశీలిస్తున్న క్రమంలో.. మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని పాల్వాయి్ గేట్ పోలింగ్ కేంద్రంలో పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేసిన అంశం వెలుగులోకి వచ్చిందని ఓ చర్చ సైతం నడుస్తుంది.

Heatwave, Heavy rain: ఉత్తరాదిలో అలా.. దక్షిణాదిలో ఇలా..


అయితే పిన్నెల్లి అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో ఈ ఘటన జరిగినా.. ఉన్నతాధికారులు సైతం సైలెంట్ అయిపోయారనే ఓ వాదన సైతం వినిపిస్తుంది. ఈ మూడు జిల్లాల్లో ఘర్షణలపై సిట్ దర్యాప్తు చేసే వరకు పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రం సాక్షిగా పిన్నెల్లి అరాచకం వెలుగులోకి రాలేదనే ప్రచారం సాగుతుంది.

అయితే సిట్ దర్యాప్తు చేయడం వల్ల మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో పిన్నెల్లి అంశం బహిర్గతమైందని.. ఇలాంటి ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల చోటు చేసుకొనే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాల్లో సందేహం సైతం వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను కూడా పరిశీలిస్తే... మరిన్ని అధికార వైసీపీ నేతల అరాచకాలు వెలుగులోకి వస్తాయనే వాదన రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తుంది.

For More Latest National News and Telugu News..

Updated Date - May 23 , 2024 | 04:02 PM