Home » AP Assembly Polls 2024
తనకు మంత్రి పదవి రావడంతో తన బాధ్యత మరింత పెంచిందని ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ స్సష్టం చేశారు. ఈ సమాజానికి తిరిగి తాము ఏం చేయగలమనే ఆలోచనతోనే ఈ రోజు తమ ప్రస్థానం మొదలవుతుందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఉదయం 11.27 గంటలకు కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.. బుధవారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అందుకోసం గన్నవరం సమీపంలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ క్రమంలో మంగళవారం రాత్రి చంద్రబాబు.. తన నివాసంలో విందు ఇస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పష్టం చేశారు. అంతేకానీ తామకు మంత్రి పదవులు ముఖ్యం కాదన్నారు. అయినా తమ పార్టీ పదవుల కోసం ఎప్పుడు సంప్రదింపులు జరపదని తెలిపారు.
ఈ పట్టణాన్ని అత్యాధునిక పట్టణంగా తీర్చిదిద్దుతానని తాడేపల్లిగూడం ప్రజలకు ఎమ్మెల్యే బొల్లిశెట్టి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాడేపల్లిగూడెం అసెంబ్లీ స్థానం నుంచి కూటమి అభ్యర్థిగా ఆయన గెలుపొందారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్. జవహర్ రెడ్డి సెలవుపై వెళ్లారు. వ్యక్తిగత కారణాలతోనే ఆయన సెలవు పెట్టినట్లు తెలుస్తుంది. బుధవారం చంద్రబాబును సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు పదవికి సజ్జల రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారు. ఆయితే ఆయన తన రాజీనామా లేఖను మంగళవారం సాయంత్రమే సాధారణ పరిపాలన శాఖకు అందజేసినట్లు తెలుస్తుంది.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లోనే కాదు.. సార్వత్రిక ఎన్నికల్లో సైతం ఫ్యాన్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఈ ఎన్నికల్లో ఓటమికి అనేక కారణాలు ఉన్నా అందులో ఒక వ్యక్తి ప్రధాన కారణమని ప్యాన్ పార్టీ కేడర్‌లో ఓ అభిప్రాయం వ్యక్తమవుతున్నట్లు తెలుస్తుంది.
రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్ట్‌తోపాటు నవ్యాంధ్ర పునర్నిర్మాణంలో కూటమి ప్రభుత్వానికి ఎన్నారైల మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని ఎన్నారై టీడీపీ అధ్యక్షుడు డాక్టర్ రవి వేమూరి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి కోసం అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నారైలంతా సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.