Home » AP Congress
నెల్లూరు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల రాజు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ .. స్వయంగా ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణ ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ‘బిగ్ డిబేట్’లో తెలుసుకుందాం వచ్చేయండి. ఇంకెందుకు ఆలస్యం.. ఈ లింక్‌ను క్లిక్ చేసి దమ్మున్న ఏబీఎన్‌లో చూసేయండి..
వైసీపీ (YSRCP)లో తాను చాలా అవమానాలు ఎదుర్కొన్నానని జనసేన నేత, నటులు పృథ్వీరాజ్ (Prithviraj) అన్నారు.ఈ ఎన్నికల్లో జగన్ ఓడిపోవడం ఖాయమన్నారు. జగన్‌కి కాదు, కూటమికే రెండు బటన్లు నొక్కడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.అసభ్యంగా మాట్లాడే మంత్రులు ఎన్నికలయ్యాక ఇంట్లోనే కూర్చునే పరిస్థితి వస్తుందని చెప్పారు. ఆదివారం నాడు విశాఖపట్నంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో వైసీపీ నేతలపై పృథ్వీరాజ్ తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఏపీలో ఎన్నికల వాతావరణం రోజురోజుకు వేడెక్కుతోంది. సమయం దగ్గరపడుతున్న కొద్దీ వైసీపీలో ఓటమి భయం పెరుగుతోంది. ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా పోటీచేస్తుండటంతో వైసీపీ నేతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారట. మరోవైపు కాంగ్రెస్ పార్టీ సైతం వైసీపీని వణికిస్తోందనే చర్చ జరుగుతోంది.
మాజీ మంత్రి వివేకానందారెడ్డి వ్యక్తిగత జీవితంపై దుర్మార్గంగా మాట్లాడటం తగదని, చనిపోయిన వ్యక్తి, సంజాయిషీ ఇవ్వలేని వ్యక్తి గురించి ఇలాంటి వ్యాఖ్యలు మరోసారి చేయొద్దని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) హెచ్చరించారు. వైసీపీ మూకలకు మళ్లీ చెబుతున్న వివేక పర్సనల్ లైఫ్‌ని టార్గెట్‌గా చేసి మాట్లాడడం మానుకోవాలని మందలించారు.
ప్రత్యేక హోదాను సీఎం జగన్‌రెడ్డి (CM Jagan) కనుమరుగు చేశారని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) అన్నారు. గురువారం నాడు శింగనమల నియోజకవర్గంలోని నార్పలలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో సీఎం జగన్‌రెడ్డి, వైసీపీ ప్రభుత్వంపై షర్మిల తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. ఒక చేత్తో పథకాలు ఇచ్చి ..మరో చేతితో జగన్ గుంజుకుంటున్నారని విమర్శించారు.
మాజీ మంత్రి వివేకానందారెడ్డి హత్య కేసుకు సంబంధించి జై భీమ్ పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థి దస్తగిరి (Dastagiri) కీలక వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్యను రాజకీయ ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party), కాంగ్రెస్ చీఫ్ షర్మిల (YS Sharmila), వివేకా కూతురు సునీతారెడ్డి వాడుకుంటున్నారని సోమవారం నాడు ఎలక్షన్ కమిషన్ (Election Commission)కి దస్తగిరి ఫిర్యాదు చేశారు.
వైసీపీ (YSRCP) పాలనలో ఏపీలో హత్యలు, దోపిడీలు పెరిగిపోయాయని ఏపీసీసీ చీఫ్, కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల (Sharmila) ఆరోపించారు. కాంగ్రెస్ చేపట్టిన ఏపీ ‘న్యాయ యాత్ర’లో భాగంగా ఆదివారం నాడు కమలాపురం నియోజకవర్గంలో పర్యటించారు. పెండ్లిమర్రి మండలం, నందిమండలం గ్రామంలో షర్మిలకు కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు.
వైఎస్సార్సీపీ చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా (Vunnamatla Eliza) ఆదివారం నాడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీలో చేరిన తర్వాత వైసీపీ, సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. వైసీపీకి రాజీనామా చేశా.. తన రాజీనామా లేఖను అధినేత జగన్ రెడ్డికి పంపించానని తెలిపారు. వైఎస్ షర్మిలా రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరానని అన్నారు. చింతలపూడి నియోజకవర్గంలో స్థానిక రాజకీయాలు తట్టుకోలేక పోయానని అన్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్.షర్మిల (YS Sharmila) ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే ఉత్కంఠ నేడు వీడనుంది. ఇవాళ ఉదయం విజయవాడ ఆంధ్రరత్న భవన్లో కడప జిల్లా నేతలతో షర్మిల సమావేశం కానున్నారు.
YS Sharmila Kadapa MP Candidate: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పరిణామాలు (AP Politics) శరవేగంగా మారిపోతున్నాయి. ఎన్నికల షెడ్యూల్ రావడంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలకు పదునుపెట్టాయి. ఇప్పటికే వైసీపీ (YSR Congress), టీడీపీ-జనసేన-బీజేపీ (TDP-Janasena-BJP) కూటమి అభ్యర్థులను దాదాపు ప్రకటించేయగా.. కాంగ్రెస్ (Congress) మాత్రం పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించగా ఇంతవరకూ ఎలాంటి ప్రకటనలు అయితే రాలేదు. అయితే ..