Share News

Congress: శింగనమల బరిలో శైలజానాథ్.. సెంటిమెంట్ కలిసొస్తుందా!

ABN , Publish Date - May 03 , 2024 | 02:31 PM

ఉమ్మడి అనంతపురం జిల్లాలో సమైక్యంధ్ర ఉద్యమం కాలం నుంచి ప్రత్యేక గుర్తింపు పొందిన నేత మాజీ మంత్రి, ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్. రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో కాంగ్రెస్(Congress) ఉనికే ప్రశ్నార్థకంగా మారిన తరుణంలో శైలజానాథ్(Sake Sailajanath) అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు.

Congress: శింగనమల బరిలో శైలజానాథ్.. సెంటిమెంట్ కలిసొస్తుందా!

శింగనమల: ఉమ్మడి అనంతపురం జిల్లాలో సమైక్యంధ్ర ఉద్యమం కాలం నుంచి ప్రత్యేక గుర్తింపు పొందిన నేత మాజీ మంత్రి, ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్. రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో కాంగ్రెస్(Congress) ఉనికే ప్రశ్నార్థకంగా మారిన తరుణంలో శైలజానాథ్(Sake Sailajanath) ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

సమైక్యవాదానికి కట్టుబడి ఉన్న నేతగా ఆయన జిల్లాలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అధికారంలో ఉన్న వైసీపీ, ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నుంచి ఆయనకు పోటీ ఉండబోతోంది.


మాజీ దివంగత సీఎంలు వైఎస్ రాజశేఖర రెడ్డి, రోశయ్య, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ఆయన మంత్రిగా పని చేశారు. తనకు సెంటిమెంట్‌లా మారిన శింగనమల నుంచి 2024 అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి బరిలోకి దిగడంతో శింగనమల రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.

ఈ స్థానంలో వైసీపీ నుంచి వీరాంజనేయులు, టీడీపీ నుంచి బండారు శ్రావణి పోటీ పడుతున్నారు. మనుగడే ప్రశ్నార్థకంగా మారిన కాంగ్రెస్ నుంచి తన సానుభూతిపరులు, మద్దతుదారుల బలగాన్నే నమ్ముకుని బరిలో దిగిన శైలజానాథ్ తన లక్ష్యాన్ని చేరుకుంటారో లేదో తెలియాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే.

ఇవి కూడా చదవండి...

Lok Sabha Polls: తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో వచ్చేసింది.. హామీలే హామీలు

Loksabha Elections 2024: సార్వత్రిక ఎన్నికల 4 వ విడతలో 10 రాష్ట్రాల్లో ఎన్నికలు

Read Latest AP News And Telugu News

Updated Date - May 10 , 2024 | 01:43 PM