AP Elections 2024: అమరావతిని... భ్రమరావతి చేశారు.. జగన్‌పై షర్మిల విసుర్లు
ABN , Publish Date - Apr 29 , 2024 | 07:39 PM
పీలో ఎక్కడ చూసినా ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా అరాచకాలు ఎక్కువైపోతున్నాయని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) ఆరోపించారు. ఎమ్మెల్యే తెల్లం బాలరాజుపై షర్మిల సంచలన ఆరోపణలు చేశారు.
ఏలూరు: ఏపీలో ఎక్కడ చూసినా ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా అరాచకాలు ఎక్కువైపోతున్నాయని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) ఆరోపించారు. ఎమ్మెల్యే తెల్లం బాలరాజుపై షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. బాలరాజు కనుసన్నల్లో ఇసుక మాఫియా జరుగుతోందని విమర్శించారు. గంజాయి, డ్రగ్స్ కంటైనర్‌లో వస్తున్నాయని మండిపడ్డారు. ఏపీకి జగన్ తీరని ద్రోహం చేశారని మండిపడ్డారు. ఈ పదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడైనా అభివృద్ధి జరిగిందా అని ప్రశ్నిచారు.
AP Elections: ఎన్నికల ముందు పోసాని కృష్ణమురళికి బిగ్ షాక్!
ఈ పదేళ్లలో పట్టుమని పది పరిశ్రమలన్న రాష్ట్రానికి వచ్చాయా అని నిలదీశారు. మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయా...? అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు సింగపూర్ చేస్తానన్నారని.. కానీ అమరావతి కాస్తా భ్రమరావతి అయిందని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డికి ఒక రాజధాని సరిపోలేదని.. మూడు రాజధానులు కావాలన్నారని.. చివరకు ఏపీకి గుండు సున్నానే మిగిల్చారని షర్మిల ఎద్దేవా చేశారు.
AP Elections 2024: ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు.. ట్విస్ట్ ఏమిటంటే..?
Read Latest Andhra pradesh News or Telugu News