AP Election 2024:మాట్లాడేది రాముడి గురించి.. చేసేది దుశ్శాసన రాజకీయాలు.. మోదీపై సీతారం ఏచూరి వ్యంగ్యాస్త్రాలు
ABN , Publish Date - May 10 , 2024 | 09:20 PM
దేశంలో మత విద్వేషాల ద్వారా బీజేపీ పాలన సాగిస్తుందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (Sitaram Yechury) ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఎవరిష్టం వచ్చినట్లు మతాన్ని నమ్మవచ్చని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అనేక చట్టాలు తీసుకు వచ్చి మైనార్టీలను టార్గెట్ చేశారని మండిపడ్డారు. రూ. 16లక్షల కోట్ల రుణాలను కార్పోరేట్ శక్తులకోసం మోదీ మాఫీ చేశారని ధ్వజమెత్తారు. జింఖానా గ్రౌండ్ లో ఇండియా కూటమి ఆధ్వర్యం శుక్రవారం భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభలో సీతారాం ఏచూరి ప్రసంగించారు.
విజయవాడ: దేశంలో మత విద్వేషాల ద్వారా బీజేపీ పాలన సాగిస్తుందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (Sitaram Yechury) ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఎవరిష్టం వచ్చినట్లు మతాన్ని నమ్మవచ్చని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అనేక చట్టాలు తీసుకు వచ్చి మైనార్టీలను టార్గెట్ చేశారని మండిపడ్డారు. రూ. 16లక్షల కోట్ల రుణాలను కార్పోరేట్ శక్తులకోసం ప్రధాని మోదీ (PM Modi) మాఫీ చేశారని ధ్వజమెత్తారు. జింఖానా గ్రౌండ్ లో ఇండియా కూటమి ఆధ్వర్యం శుక్రవారం భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభలో సీతారాం ఏచూరి ప్రసంగించారు.
AP Elections: చివరి రెండు రోజులు.. ఎవరి వ్యూహాలు వారివి..!
రైతులు తీసుకున్న స్వల్ప రుణాలను మాత్రం బలవంతంగా కట్టించుకుంటున్నారని విమర్శించారు. దేశంలో 22 మంది వద్ద ఉన్న సంపద.. దేశంలో వంద కోట్ల మంది దగ్గర ఉన్న ఆస్తితో సమానమని తెలిపారు. దేశంలో 90శాతం కుటుంబాలు అప్పులు తీసుకుని జీవనం సాగిస్తున్నారని.. ఇదీ మోడీ ప్రభత్వం చెప్పిన గణాంకాలే అని వివరించారు. 42శాతం గ్రాడ్యూయేట్లు నేడు దేశంలో నిరుద్యోగులుగా ఉన్నారని చెప్పుకొచ్చారు. ప్రజల జీవితాలపై ఆర్థిక దాడులు బాగా పెరిగాయని దుయ్యబట్టారు. లౌకిక దేశంగా ఉన్న దేశాన్ని హిందూ దేశంగా మార్చాలని మోదీ కుట్ర చేస్తున్నారని విరుచుకుపడ్డారు.
AP Election 2024: వైసీపీ కోసం.. లూప్‌లైన్ ‘వ్యూహం’
ఏపీకి ప్రత్యేక హోదా పదేళ్లు ఇస్తామని బీజేపీ నాడు ప్రకటించింది.. ఏమైందో చెప్పాలని ప్రశ్నించారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ , కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏమైందని నిలదీశారు. పోలవరం పూర్తి చేస్తామన్న బీజేపీ. ఎందుకు చేయలేదని అడిగారు.మోదీ వ్యతిరేక పార్టీలన్నీ ఇండియా కూటమిలోనే ఉన్నాయని తెలిపారు. చంద్రబాబు, జగన్ లు మోడీ కోసం పని చేస్తున్నారని విమర్శించారు. బుర్రకథ చెప్పేవారు మోదీ అయితే.. తందానా అనేందుకు టీడీపీ, జనసేన తయారయ్యాయని ఎద్దేవా చేశారు.ఏపీలో ట్రయాంగల్లో రాజకీయాలు నడుస్తున్నాయని సెటైర్లు గుప్పించారు.
రాముడి గురించి మాట్లాడే మోదీ.. దుశ్శాసన రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.ఏపీలో వైసీపీ సింహాసనం రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.తాను సింహాసనం దిగనని.. ఏదైనా తనకే కావాలనే విధంగా వైసీపీ తీరు ఉందని అన్నారు. ఏపీకి మంచి భవిష్యత్ కావాలంటే తప్పకుండా ఇండియా కూటమిని గెలిపించాలని కోరారు. ప్రజాశాసన రాజకీయాలు కావాలంటే... ప్రజలు కూటమి పక్షాన నిలబడాలని సీతారాం ఏచూరి తెలిపారు.
AP Election 2024 : విజన్ X విధ్వంసం.. చంద్రబాబు, జగన్‌కు తేడా ఇదే
Read Latest AP News And Telugu News