Home » AP Election Results
‘అనంతపురం జిల్లా నా గుండెల్లో ఉంటుంది. మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నాది. అధికారంలోకి రాగానే వైసీపీ ప్రభుత్వం ఎత్తేసిన అన్ని పథకాలను పునరుద్ధరిస్తాం. అన్నివర్గాల ప్రజలను ఆదుకుంటాం..’ అని టీడీపీ అధినేత చంద్రబాబు మాటిచ్చారు. 2014 ఎన్నికల్లో 12 మంది ఎమ్మెల్యేలను ఇచ్చినందుకు అనేక పథకాలతో ఆదుకున్నారు. అంతర్జాతీయ కార్ల తయారీ పరిశ్రమ ‘కియ’ను కరువు నేలపైకి తీసుకొచ్చారు. రైతులకు సబ్సిడీ పథకాలు, నిరుద్యోగులకు భృతి, పేదలకు అన్న క్యాంటీన, ఆపన్నులకు పింఛన్లు, యువతకు ఉద్యోగాలు..
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోరా ఓటమిని చవిచూసిన విషయం తెలిసిందే. వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి (YS Jagan Reddy) నేడు(గురువారం) ఆ పార్టీకి చెందిన కీలక నేతలతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఓటమికి గల కారణాలపై విశ్లేషించుకున్నారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఊహించని ఓటమితో వైఎస్సార్సీపీ (YSRCP) కకావికలం అవుతోంది. ఈ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత ఆ పార్టీలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎన్డీఏ కూటమి ఘనవిజయం.. ఆ పార్టీ కేవలం11 సీట్లకే పరిమితం అవడంతో వైసీపీ కేడర్ నైరాశ్యంలో మునిగిపోయారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి (NDA Alliance) ఘన విజయం సాధించిన విషయం తెలసిందే. ప్రభుత్వం మారడంతో వైసీపీ (YSRCP) కీలక నేతలు, మాజీ మంత్రులు తట్టా బుట్ట సర్దేస్తున్నారు. కొంతమంది నేతలు ఇప్పటికే రాష్ట్రాన్ని వదలి విదేశాలకు వెళ్లిపోయినట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించడంపై ఆయా పార్టీ శ్రేణులు విజయోత్సవ సంబరాలు నిర్వహించుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కేక్‌లు కట్‌చేసి, బాణాసంచా కాల్చి కూటమి విజయాన్ని వేడుకుగా జరుపుకుంటున్నారు.
గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం పనితీరును గమనించిన ఏపీ ప్రజలు విలక్షణమైన తీర్పును ఇచ్చారు. పాలనను గాలికొదిలేసి వైసీపీ నేతలు టీడీపీ అధినేత చంద్రబాబును, ఆయన కుటుంబాన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం ప్రజలంతా చూశారు. అక్రమ కేసులు బనాయించి చంద్రబాబును జైల్లో పెట్టి.. ఆయన కుటుంబాన్ని తీవ్రంగా వేధించారు.
ఏపీ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ఐదేళ్ల వైసీపీ పాలనపై ఓటర్లు ఎంత వ్యతిరేకంగా ఉన్నారో ఫలితాలు స్పష్టం చేశాయి. సంక్షేమ పథకాల పేరుతో వందల కోట్ల రూపాయిలు నేరుగా ప్రజల ఖాతాల్లో వేసినా ఓట్లు పడకపోవడం వైసీపీ అధినేత జగన్‌ను ఆశ్చర్యం కలిగించింది.
మంగళవారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైన ఏపీ ఎన్నికల కౌంటింగ్‌పై ఫైనల్‌గా ఫుల్ పిక్చర్ వచ్చేసింది. ఏయే పార్టీ ఎన్ని సీట్లు గెలిచాయో లెక్క తేలింది. 175 అసెంబ్లీ సీట్లకు...
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువాళ్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ కూటమి గెలుపును తమ గెలుపుగా విశ్వవ్యాప్తంగా తెలుగువాళ్లు జరుపుకుంటున్నారు.
అవును.. అనుకున్నట్లే జరిగింది..! ఇద్దరూ ‘పీకే’లు వైసీపీ (YSR Congress) జెండాను పీకి పడేశారు..! ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో (AP Election Results) ఘోరాతి ఘోరంగా వైసీపీ ఓడిపోయింది..! ఎంతలా అంటే వైనాట్ 175 నుంచి సింగిల్ డిజిట్‌కే పరిమితమైన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఇద్దరు పీకేలను కూటమి పార్టీ శ్రేణులను గుర్తు చేసుకుంటున్నారు...